IND vs NZ: తుదిజట్టులో కాదు..అసలు అతను జట్టులోనే లేడు: టీమిండియా కోచ్
సొంతగడ్డపై భారత్‌కు ఊహించని పరాభవం ఎదురైంది. పుష్కరకాలం తర్వాత టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. స్వదేశంలో వరుసగా 18 సిరీస్‌లు గెలిచిన టీమిండియా జైత్రయాత్రకు తెరపడింది. మరో మ్యాచ్ మిగిలుండగానే మూడు టెస్టుల సిరీస్‌ను 0-2తో చేజార్చుకుంది. ఈ పరాజయం డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను తీవ్రంగా దెబ్బతీసింది.
డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు చేరాలంటే మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లో భారత్ కనీసం నాలుగింట్లో నెగ్గాల్సి ఉంది.చివరి అయిదు మ్యాచ్‌లు ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉండటంతో న్యూజిలాండ్‌తో శుక్రవారం నుంచి జరగనున్న మూడో టెస్టులో భారత్ తప్పక విజయం సాధించాల్సి ఉంది. కాగా, ఈ పరిస్థితుల్లో భారత జట్టులో మరో ప్లేయర్ చేరాడని వార్తలు వచ్చాయి. ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా జట్టులో చేరాడని, ఆస్ట్రేలియా పర్యటనను దృష్టిలో ఉంచుకుని అనుభవం కోసం.. కివీస్‌తో ఆఖరి టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయనున్నాడని కథనాలు వెల్లువడ్డాయి.

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు హర్షిత్ రాణా తొలుత రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. అయితే రంజీ ట్రోఫీలో ఆడమని ఆదేశాలు రావడంతో హర్షిత్ టీమిండియాను విడిచి ఢిల్లీ తరఫున ఆడుతున్నాడు. కానీ ఆఖరి టెస్టు కోసం తిరిగి ప్లేయర్‌గా ఎంపికయ్యాడని జాతీయ మీడియాలో మంగళవారం వార్తలు వచ్చాయి. ఈ కథనాలపై టీమిండియా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ స్పందించాడు. హర్షిత్ రాణా అసలు భారత జట్టులోనే లేడని తెలిపాడు. ఎవరిని అదనంగా కివీస్‌తో ఆఖరి టెస్టుకు ఎంపిక చేయలేదని వివరించాడు.
''జట్టులో అదనంగా ఎలాంటి మార్పు లేదు. ప్రతి రోజు, ప్రతి వారం మాకు కీలకం. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ గురించి ఇప్పుడే ఆలోచించే అంత మందబుద్ధి మాకులేదు. మేం ప్రస్తుతం న్యూజిలాండ్‌తో ఆఖరి టెస్టుపై మాత్రమే దృష్టి పెడుతున్నాం'' అని అభిషేక్ నాయర్ తెలిపాడు. కాగా, కివీస్ సిరీస్ ఎంపిక కానప్పటికీ ఆస్ట్రేలియా పర్యటనకు హర్షిత్ రాణా ఎంపికైన విషయం తెలిసిందే.
ఐపీఎల్ 2024 సీజన్‌లో 19 వికెట్లతో కేకేఆర్ ఛాంపియన్‌గా నిలవడంలో ఈ యువ బౌలర్ హర్షిత్ రాణా కీలక పాత్ర పోషించాడు. అయితే టీ20 వరల్డ్ కప్ అనంతరం భారత జట్టుకు హర్షిత్ రాణా ఎంపిక అవుతున్నప్పటికీ తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. జింబాబ్వే, శ్రీలంక, బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లకు ఎంపికైనా బరిలోకి దిగే అవకాశం రాలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications