సమన్వయ లోపం: విజయ్ శంకర్‌ని రనౌట్ చేసిన రాయుడు (వీడియో)

హైదరాబాద్: న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్ వేదికగా ఆదివారం ప్రారంభమైన ఆఖరి వన్డేలో టీమిండియా కీలక సమయంలో విజయ్ శంకర్ వికెట్‌ను కోల్పోయింది. అంబటి రాయుడితో సమన్వయ లోపం కారణంగా విజయ్ శంకర్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ 32వ ఓవర్ వేసిన మున్రో బౌలింగ్‌లో బంతిని షార్ట్ మిడ్‌వికెట్ దిశగా తరలించిన విజయ్ శంకర్ క్రీజు వెలుపలికి వచ్చి నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోని రాయుడిని పరుగు కోసం పిలిచాడు.
బంతి నేరుగా ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లడంతో
అయితే, బంతి నేరుగా ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లడంతో పరుగుకి తొలుత నిరాకరించిన రాయుడు ఆ తర్వాత అనూహ్యంగా పరుగెత్తాడు. అదే సమయంలో రాయుడు నో చెప్పడంతో.. వెనక్కి వెళ్లేందుకు సిద్ధమై.. పిచ్ మధ్యలోనే ఆగిపోయిన విజయ్ శంకర్.. మళ్లీ రాయుడు పరిగెత్తడంతో దిక్కుతోచని స్థితిలోకి వెళ్లాడు. అప్పటికే బంతిని అందుకున్న ఫీల్డర్ బౌలర్ మున్రోకి బంతినివ్వడంతో శంకర్ రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది.

98 పరుగుల భాగస్వామ్యం
దీంతో వీరిద్దరి భాగస్వామ్యానికి తెరపడింది. ఐదో వికెట్‌కు వీరి జోడి 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ క్రమంలో జట్టు స్కోరు 116 వద్ద విజయ్ శంకర్ పేలవంగా రనౌటయ్యాడు. విజయ్ శంకర్ రనౌటైన తర్వాత దూకుడుగా ఆడిన రాయుడు.. సెంచరీ దిశగా దూసుకెళ్లాడు.

మున్రోకి క్యాచ్ ఇచ్చి ఔటైన రాయుడు
జట్టు స్కోరు 190 వద్ద సిక్స్ కొట్టే ప్రయత్నంలో హెన్రీ బౌలింగ్‌లో ఫీల్డర్ మున్రోకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్య ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇన్నింగ్స్ 47వ ఓవర్ వేసిన ఆస్లే బౌలింగ్‌లో 6, 6, 6 బాదిన హార్దిక్.. ఆ తర్వాత ఓవర్‌లోనూ బౌల్ట్ బౌలింగ్‌లో కళ్లు చెదిరే సిక్స్ బాదాడు. ఇక ఇన్నింగ్స్ 49వ ఓవర్ వేసిన నీషమ్ బౌలింగ్‌లోనూ 4, 6 బాదేశాడు.

టీమిండియా 252 ఆలౌట్
అయితే, జట్టు స్కోరు 248 వద్ద పాండ్యా ఔటవగా.. ఆఖరి ఓవర్‌లో లేని పరుగు కోసం ప్రయత్నించి మహ్మద్ షమీ రనౌటయ్యాడు. దీంతో ఒక బంతి మిగిలుండగానే టీమిండియా 252 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3 వికెట్లు, నీషమ్ ఒక వికెట్ తీసుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications