For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NZ: నాలుగో టీ20లో టీమిండియా ప్రయోగాలు.. సంజూకు ఆఖరి ఛాన్స్?

IND vs NZ: భారత, న్యూజిలాండ్ జట్ల మధ్య నేడు విశాఖపట్నం వేదికగా నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఈ సిరీస్‌ను భారత్ 3-0తో కైవసం చేసుకున్న నేపథ్యంలో నేటి మ్యాచ్‌లో తుది జట్టులో కీలక మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న ఆటగాళ్లకు ఇది చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం.

సంజూ వర్సెస్ ఇషాన్ కిషన్.. ఓపెనింగ్ బెర్త్ ఎవరికి?
ప్రస్తుత సిరీస్‌లో టీమిండియాకు అతిపెద్ద తలనొప్పిగా మారింది సంజూ శాంసన్ ఫామ్. గత మూడు మ్యాచ్‌ల్లో సంజూ శాంసన్ కేవలం 16 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మరోవైపు ఇషాన్ కిషన్ 224 స్ట్రైక్ రేట్‌తో 112 పరుగులు చేసి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అయితే నెట్ ప్రాక్టీస్‌లో సంజూ శాంసన్ గంటల తరబడి శ్రమించడం చూస్తుంటే.. మేనేజ్మెంట్ అతనికి మరో అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సంజూ శాంసన్ మరోసారి విఫలమైతే.. అది అతని కెరీర్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ind vs nz 4th t20 Last Chance for Sanju Samson Team India Likely Playing 11 for Vizag Match

శ్రేయస్ అయ్యర్ రీ-ఎంట్రీ!
నెట్స్‌లో స్పిన్నర్లపై విరుచుకుపడుతున్న శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్‌తో తిరిగి జట్టులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మిడిలార్డర్‌లో టీమ్ బలాన్ని పెంచడానికి శ్రేయస్ అయ్యర్ రాక తోడ్పడుతుంది. అలాగే గాయం నుంచి కోలుకున్న అక్షర్ పటేల్ కూడా నెట్స్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొడుతున్నాడు. అతను జట్టులోకి వస్తే వైస్ కెప్టెన్ బాధ్యతలు ఎవరు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

కుల్దీప్ యాదవ్‌కు విశ్రాంతి?
బౌలింగ్ విభాగంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ అయ్యర్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. గత మ్యాచ్‌లో అతను 3 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీనికి భిన్నంగా రవి బిష్ణోయ్ పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీస్తున్నాడు. వరుణ్ చక్రవర్తి తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉండటంతో, కుల్దీప్‌ను బెంచ్‌కే పరిమితం చేసే ఛాన్స్ ఉంది.

భారత జట్టు అంచనా
భారత్ ఈ మ్యాచ్‌లో 4-0తో ఆధిక్యాన్ని పెంచుకోవాలని చూస్తోంది. హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణాకు విశ్రాంతినిచ్చి అర్ష్‌దీప్ సింగ్‌ను బరిలోకి దించే అవకాశం ఉంది.

ఓపెనర్లు: సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ

మిడిల్ ఆర్డర్: శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శివమ్ దూబే

ఆల్ రౌండర్లు: అక్షర్ పటేల్, రింకూ సింగ్

బౌలర్లు: రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్

Story first published: Wednesday, January 28, 2026, 9:59 [IST]
Other articles published on Jan 28, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+