మూడో టీ20లో తప్పిదం: అదెలా మరిచారు, క్షమాపణ
హైదరాబాద్: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య సిరిస్ ముగిసింది. న్యూజిలాండ్ జట్టు స్వదేశానికి వెళ్లింది. తిరువనంతపురం ఆతిథ్యం ఇచ్చిన మూడో టీ20లో మ్యాచ్ నిర్వహకులు ఓ తప్పిదం చేశారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయ గీతాలాపన చేయడం మరిచిపోయారు.
ఈ విషయం గురువారం వెలుగులోకి రావడంతో కేరళ క్రికెట్ అసోసియేషన్ ఇప్పుడు క్షమాపణలు కోరింది. దీనిపై కేరళ క్రికెట్ అసోసియేషన్(కేసీఏ) సెక్రటరీ జయేష్ జార్జి మాట్లాడుతూ 'ఇది పూర్తిగా మా తప్పిదమే. ఆ సమయంలో అందరం మైదానంలోనే ఉన్నాం' అని అన్నాడు.

జాతీయ గీతాలాపన మర్చిపోయాం
'వర్షం ఆగడంతో వీలైనంత త్వరగా మ్యాచ్‌ను ప్రారంభించాలన్న కంగారులో జాతీయ గీతాలాపన మర్చిపోయాం. దీనికి క్షమాపణ కోరుతున్నాం. భవిష్యత్తులో మరోసారి ఈ తప్పిదం జరగకుండా చూసుకుంటాం' అని జార్జి తెలిపాడు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌కి కేసీఏ కేరళకు చెందిన మాజీ ఆటగాళ్లను ఆహ్వానించింది.

అసలేం జరిందంటే
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య చివరి మ్యాచ్‌కు తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియం ఆతిథ్యమిచ్చింది. 29 ఏళ్ల తర్వాత ఈ స్టేడియం ఆతిథ్యమిస్తోన్న తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడంతో
కేరళ క్రికెట్ అసోసియేషన్(కేసీఏ) పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది.

రాత్రి 9:30 గంటలకు ప్రారంభమైన మ్యాచ్
అయితే మ్యాచ్‌కి ముందు మూడు రోజులుగా కురిసిన వర్షం కారణంగా రాత్రి 7 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ రాత్రి 9:30 గంటలకు ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో అంఫైర్లు మ్యాచ్‌ని 8 ఓవర్లకు కుదించారు. దీంతో ఇరు జట్ల కెప్టెన్లు టాస్ వేసేందుకు మైదానంలోకి వచ్చారు.

జాతీయ గీతాలాపన మరిచిపోయారు
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కోహ్లీసేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. సాధారణంగా టాస్ వేసిన అనంతరం ఇరు జట్లు ఆటగాళ్లు మైదానంలోకి వచ్చి తమ తమ జాతీయ గీతాలను ఆలపించడం ఎప్పటి నుంచో ఆనవాయితీ వస్తోంది. ఈ మ్యాచ్‌లో అది మరిచిపోయారు. టాస్ అనంతరం ఆటగాళ్లు మైదానంలోకి రావడం, మ్యాచ్ జరగడం చకా చకా జరిగిపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications