For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NZ: మూడో వన్డేకు టీమిండియా రెడీ.. బరిలోకి దిగే తుది జట్టు ఇదే!

IND vs NZ: భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్‌ ఓటమి నుంచి తేరుకుంది. బుధవారం రాజ్‌కోట్ వేదికగా జరిగిన రెండో వన్డేలో సమష్టిగా రాణించిన న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆఖరి, మూడో వన్డే ఆదివారం (జనవరి 18) ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరగనుంది. 1-1తో సమంగా ఉన్న ఇరు జట్లు మూడో వన్డేలో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నాయి.

గాయాల బెడదలో టీమిండియా
ఈ సిరీస్ మధ్యలో భారత్‌కు గాయాల సమస్యలు ఎదురయ్యాయి. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ పక్కటెముకల గాయంతో సిరీస్ మొత్తానికి దూరం కాగా.. అతని స్థానంలో యువ ఆటగాడు ఆయుష్ బదోని జట్టులోకి వచ్చాడు. అలాగే వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా గాయంతో అందుబాటులో లేకపోవడంతో ధ్రువ్ జురేల్ బ్యాకప్‌గా ఉన్నాడు.

IND vs NZ 3rd ODI Team India Ready for Series Decider Predicted Playing XI Revealed

తెలుగోడికి నో ఛాన్స్..
తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి మూడో వన్డేలో చోటు దక్కే అవకాశం లేదని తెలుస్తోంది. టీమ్‌మేనేజ్‌మెంట్ ఏరి కోరి పార్ట్‌టైమ్ బౌలర్ అయిన బదోనిని తీసుకోవడంతో మూడో వన్డేలో అతడిని తుది జట్టులో ఆడిస్తారనే విషయం స్పష్టమైంది. పైగా బదోని గంభీర్‌కు ఫేవరేట్ ప్లేయర్. తుది జట్టులో అతనికి చోటు ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ క్రమంలోనే నితీష్ మరోసారి బెంచ్‌కే పరిమితం కానున్నాడు.

ప్రసిధ్ కృష్ణపై వేటు..
ఇప్పటివరకు జరిగిన రెండు వన్డేల్లోనూ నిరాశపర్చిన ప్రసిధ్ కృష్ణపై వేటు పడవచ్చు. అతని స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ ఆడవచ్చు.తొలి మ్యాచ్‌లో ప్రసిధ్ కృష్ణ 2 వికెట్లు తీసినప్పటికీ ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. రెండో వన్డేలో ప్రసిద్ధ్ కృష్ణ ఒక వికెట్ పడగొట్టాడు. ఒకవేళ అతనికి మరో అవకాశం ఇవ్వాలనుకుంటే మాత్రం పేస్ విభాగంలో ఎలాంటి మార్పులు జరగవు. మిగతా కాంబినేషన్‌లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. ఓపెనర్లుగా శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ కొనసాగనున్నారు. గిల్ హాఫ్ సెంచరీతో రాణించినా.. రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు.

టీమిండియా ప్లేయింగ్ 11 అంచనా
హోల్కర్ స్టేడియం బ్యాటింగ్‌కు స్వర్గధామం కావడంతో, భారత్ భారీ స్కోరు లక్ష్యంగా బరిలోకి దిగే అవకాశం ఉంది.

*రోహిత్ శర్మ: వెటరన్ ఓపెనర్ మంచి ఫామ్‌లో ఉన్నాడు, ఇండోర్‌లో భారీ ఇన్నింగ్స్ ఆశించవచ్చు.

*శుభ్‌మన్ గిల్ (కెప్టెన్): కివీస్‌పై అద్భుతమైన రికార్డు ఉన్న గిల్, మరోసారి బ్యాట్‌తో మెరవాలని చూస్తున్నాడు.

*విరాట్ కోహ్లీ: వన్డేల్లో రికార్డుల రారాజు కోహ్లీ తన ఫామ్‌ను కొనసాగించనున్నాడు.

*శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్): గాయం తర్వాత రీ-ఎంట్రీ ఇచ్చిన అయ్యర్ మిడిల్ ఆర్డర్‌లో కీలకం.

*కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్): కీపింగ్ బాధ్యతలతో పాటు ఫినిషర్‌గా రాహుల్ కీలక పాత్ర పోషించనున్నాడు.

*రవీంద్ర జడేజా: సీనియర్ ఆల్‌రౌండర్ బ్యాట్, బంతితో జట్టుకు వెన్నెముక.

నితీష్ కుమార్ రెడ్డి / ఆయుష్ బదోని: సుందర్ అందుబాటులో లేకపోవడంతో ఈ ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ దక్కవచ్చు.

*కుల్దీప్ యాదవ్: స్పిన్ విభాగంలో కుల్దీప్ మ్యాజిక్ ఇండోర్ పిచ్‌పై కీలకం కానుంది.

*మహమ్మద్ సిరాజ్: పవర్‌ప్లేలో వికెట్లు తీయడంలో సిరాజ్ స్పెషలిస్ట్.

అర్ష్‌దీప్ సింగ్/ప్రసిద్ధ్ కృష్ణ: మూడో వన్డేలో ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ ఆడే అవకాశం ఉంది. ఎడమచేతి వాటం పేసర్ డెత్ ఓవర్లలో పరుగులను నియంత్రించగలడు.

హర్షిత్ రాణా: పేస్ విభాగంలో ప్రయోగాలు చేయాలనుకుంటే హర్షిత్ రాణాకు అవకాశం ఇవ్వవచ్చు.

Story first published: Thursday, January 15, 2026, 12:08 [IST]
Other articles published on Jan 15, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+