Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ: తుదిజట్టులో భారీ మార్పులు.. ఆ ముగ్గురు ఔట్: రోహిత్

తొలి టెస్టులో న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన భారత్ మరో టెస్టుకు సిద్ధమైంది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా పుణె వేదికగా ఇవాళ నుంచి రెండో టెస్టు ఆడనుంది. తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలి అపకీర్తి మూటగట్టుకున్నప్పటికీ, ఆ తర్వాత టీమిండియా పుంజుకుని గొప్పగానే పోరాడింది. కానీ విజయాన్ని అందుకోలేకపోయింది.

టెస్టు సిరీస్‌ను నిలుపుకోవాలంటే రెండో టెస్టు‌లో భారత్ తప్పక సత్తాచాటాలి. కివీస్‌ను చిత్తు చేసి సిరీస్‌పై గురిపెట్టాలి. అంతేగాక వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్తు రేసులో నిలవడానికి పుణె టెస్టు టీమిండియాకు ఎంతో కీలకం. 2012 నుంచి స్వదేశంలో భారత్ ఒక్క టెస్టు సిరీస్‌ను కూడా కోల్పోలేదు. 18 సిరీస్‌ల్లో విజయం సాధించింది. కాగా, టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది.

IND vs NZ 2nd Test Rohit Sharma Confirms Three Changes Siraj KL and Kuldeep Out Akash Deep Washington and Gill In

న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ మాట్లాడుతూ.. గత టెస్టు ఆడిన పిచ్ కంటే ఇది భిన్నంగా ఉందని అన్నాడు. తొలి టెస్టులో గెలిచిన జోరును కొనసాగించడానికి ప్రయత్నిస్తామని చెప్పాడు. గాయం కారణంగా మ్యాట్ హెన్నీ జట్టుకు దూరమయ్యాడని, అతని స్థానంలో మిచెల్ శాంట్నర్ వచ్చాడని లాథమ్ తెలిపాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. జట్టులో మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పాడు. మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, కుల్‌దీప్ యాదవ్ దూరమయ్యారని, వాళ్ల స్థానంలో ఆకాశ్ దీప్, శుభ్‌మన్ గిల్, వాషింగ్టన్ సుందర్‌ తుదిజట్టులోకి వచ్చారని రోహిత్ చెప్పాడు.

జట్టు వివరాలు
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్).

న్యూజిలాండ్: టామ్ లాథమ్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, టిమ్ సౌథి, అజాజ్ పటేల్, విలియమ్ ఒరుర్కే.

Story first published: Thursday, October 24, 2024, 9:14 [IST]
Other articles published on Oct 24, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+