సొంతగడ్డపై టెస్టుల్లో అప్రతిహత విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా తమతో తామే పోటీపడాలని నిర్ణయించుకున్నట్లుగా ఉంది. ప్రత్యర్థి చేతికి ఆయుధాన్ని ఇచ్చి తలపడాలని నిర్ణయించుకున్నట్లు అనిపిస్తోంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వ్యూహాలు చూస్తుంటే సగటు అభిమానికి ఇదే ఆలోచన కలుగుతోంది.
ఇటీవల కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో రోహిత్ అంచనాలకు భిన్నంగా బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత్ గడ్డపై నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ అత్యంత కఠిన సవాలే. అయితే ఆ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో పరిస్థితి మారిపోయింది. అద్భుత ఆటతీరుతో డ్రా కావాల్సిన మ్యాచ్‌ను భారత్ విజయం సాధించింది.

అయితే అదే ఉత్సాహంతో రోహిత్ శర్మ న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులోనూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. ఫలితంగా జట్టును ప్రమాదంలోకి నెట్టాడు. అసలేం జరిగిందంటే.. బెంగళూరు వేదికగా కివీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన రోహిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పది ఓవర్లలోపే టీమిండియా కీలక మూడు వికెట్లు కోల్పోయింది. రోహిత్ 2 పరుగులు చేయగా, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్ డకౌట్లయ్యారు.
ఇది బ్యాటర్ల పేలవమైన ఆట తీరుకు నిదర్శనం కాదు. పేస్‌కు అనూకూలిస్తున్న పిచ్‌పై న్యూజిలాండ్ బౌలర్ల ఆధిపత్యం. వర్షం కారణంగా తొలి రోజు ఆట రద్దయింది. మేఘూవృతమైన వాతావరణం మధ్య ఇవాళ రెండో రోజు ఆట ప్రారంభమైంది. కవర్లతో పిచ్‌ను గత కొన్ని రోజులుగా కప్పి ఉంచడం, పిచ్‌పై కాస్త ఉన్న తేమతో.. తొలి సెషన్‌లో బౌలర్లదే పైచేయి ఉంటుంది. కానీ కోచ్ గౌతమ్ గంభీర్ సలహాతో రోహిత్ మాత్రం మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. కానీ ఈ నిర్ణయం బెడిసి కొట్టింది.
అయితే తొలుత భారీ స్కోరు సాధించి మ్యాచ్ ఫలితాన్ని రాబట్టడం, వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా సిరీస్‌కు సన్నద్ధం కావడం.. వంటి కారణాలో రోహిత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కానీ బలమైన న్యూజిలాండ్ పేస్ దళం ముందు మన బ్యాటర్లు తేలిపోతున్నారు.