IND vs NZ: ఆడినా, ఆడకపోయినా మేమున్నామనే భరోసా కల్పిస్తాం.. కోహ్లీ సేవలను ఉపయోగించుకుంటాం: రోహిత్

జైపూర్: జట్టులోని ప్రతి ఒక్కరు భయం లేకుండా స్వేచ్ఛగా ఆడేలా చూస్తానని భారత టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. బాగా ఆడినా, ఆడకపోయినా మీకు అండగా మేమున్నామనే భరోసా కల్పిస్తామన్నాడు. భారత జట్టులో విరాట్ కోహ్లీ చాలా కీలక ఆటగాడని, టీమ్ అవసరాలను బట్టి అతడి సేవలను ఉపయోగించుకుంటామని రోహిత్ చెప్పాడు. వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు జట్లను తయారు చేసే ఆలోచన ప్రస్తుతం లేదని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. న్యూజిలాండ్‌తో బుధవారం నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్ ముందు.. రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై స్పందించారు.
మేమున్నామనే భరోసా కల్పిస్తాం:
రోహిత్ శర్మ మాట్లాడుతూ... 'జట్టులోని ఒకరిద్దరిపైనే ఆధారపడితే విజయాలు సాధించలేం. అందుకే జట్టు అవసరాలకు అనుగుణంగా ఆటగాళ్లను మలుచుకుంటాం. ప్రతి ఒక్కరు భయం లేకుండా స్వేచ్ఛగా ఆడేలా చూస్తా. మీరు బాగా ఆడినా, ఆడకపోయినా మీకు అండగా మేమున్నామనే భరోసా కల్పిస్తాం. మా జట్టులో కొన్ని లోపాలున్నాయి. వాటిని సరిదిద్దుకోవడమే మా ముందున్న అతిపెద్ద సవాల్. ఈ క్రమంలో ఇతర జట్ల వ్యూహాలను మేం అనుసరించం. మాకు ఏది సరిపోతుందో ఆ మార్గాన్నే ఎంచుకుంటాం. ప్రతి ఆటగాడు మాకు ముఖ్యమే. అందుకే వారిపై పని భారం పడకుండా చూస్తాం. మా జట్టులో విరాట్ కోహ్లీ కీలక ఆటగాడు. జట్టు అవసరాలను బట్టి అతడి సేవలను ఉపయోగించుకుంటాం' అని అన్నాడు.
ఆ ఆలోచన ఇప్పుడు లేదు:
రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ... 'మాకు అన్ని ఫార్మాట్లు ముఖ్యమే. భవిష్యత్తులో జరుగనున్న ఐసీసీ టోర్నమెంట్లను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలు పెట్టాం. అన్ని విభాగాల్లో బలోపేతం అయ్యేందుకు ప్రయత్నిస్తాం. వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు జట్లను తయారు చేసే ఆలోచన ఇప్పుడు లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆటగాళ్ల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటాం. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా రాణించాలంటే ప్రతి ఒక్క ఆటగాడు తాజాగా ఉండటం చాలా ముఖ్యం. కీలక ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి దొరికేలా చూస్తా. ఒకే ఆటగాడు అన్ని ఫార్మాట్లలో రాణించడం చాలా కష్టం. అందుకే జట్టు అవసరాలను బట్టి ఆటగాళ్లను తయారు చేసుకుంటాం' అని చెప్పారు.
రోహిత్-ద్రవిడ్ కాంబినేషన్ అదిరేనా:
టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ జైపుర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరుగనుంది. హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్, కెప్టెన్‌గారోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టిన అనంతరం టీమిండియా ఆడుతున్న తొలి సిరీస్ ఇదే కావడం విశేషం. ఐపీఎల్‌లో సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న రోహిత్.. ఇండియా-ఏ, అండర్-19 కోచ్‌గా తనదైన ముద్ర వేసిన ద్రవిడ్ కాంబినేషన్‌లో టీమిండియా 2022 టీ20 ప్రపంచకప్ టైటిలే లక్ష్యంగా సన్నాహకాలు ప్రారంభించనుంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌పై ప్రస్తుతం అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను వీరు ఏ మేరకు అందుకుంటారో చూడాలి. ఇక విరాట్, హార్దిక్, జడేజా, బుమ్రా, షమీ స్థానాల్లో ఎవరిని తుది జట్టులోకి తీసుకుంటారో చూడాలి.
భారత్ తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, వెంకటేశ్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్/అక్షర్ పటేల్, దీపక్ చహర్/భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ సిరాజ్/హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, యుజ్వేంద్ర చహల్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications