Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ 1st T20I: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రోహిత్.. వెంకటేష్ అరంగేట్రం! నాలుగు మార్పులతో కివీస్!!

IND vs NZ 1st T20I Playing 11 Is Out: Venkatesh Iyer To Debut And Rohit Sharma To Chase In Jaipur

జైపూర్: భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య టీ20 సిరీస్‌కు రంగం సిద్ధమైంది. జైపూర్‌లోని సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో మరికొద్దిసేపట్లో తొలి టీ20 జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఐపీఎల్ స్టార్ వెంకటేష్ అయ్యర్ భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. శ్రేయాస్ అయ్యర్ జట్టులోకి వచ్చాడు. దీపక్ చహర్, భువనేశ్వర్ కుమార్‌, మహ్మద్ సిరాజ్ కూడా మ్యాచ్ ఆడుతున్నారు. స్పిన్ కోటాలో అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ ఆడుతున్నారు.

మరోవైపు న్యూజిలాండ్‌ తాత్కాలిక సారథి టీమ్ సౌథీ తుది జట్టులో నాలుగు మార్పులు చోటుచేసుకున్నట్టు చెప్పాడు. జేమ్స్ నీషమ్, కేన్ విలియ‌మ్‌స‌న్, ఐష్ సోధి మరియు ఆడమ్ మిల్నే ఈ మ్యాచ్ ఆడడం లేదు. మార్క్ చాప్‌మన్, టాడ్ ఆస్టిల్, రచిన్ రవీంద్ర మరియు లాకీ ఫెరుగ్సన్ వారి స్థానాల్లో ఆడుతున్నారు. ఈ టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్ రెగ్యులర్ కెప్టెన్ విలియ‌మ్‌స‌న్ దూరం అయ్యాడు. గత కొద్ది కాలంగా విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న విలియమ్సన్‌కు కివీస్ బోర్డ్‌ విశ్రాంతినిచ్చింది. అయితే న‌వంబ‌ర్ 25 నుంచి కాన్పూర్‌లో జ‌ర‌గ‌నున్న టెస్టు సిరీసుకు అందుబాటులో ఉండనున్నాడు.

ఈ మ్యాచ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌, టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మ కొత్త ఇన్నింగ్స్‌ని ప్రారంభించబోతున్నారు. ఐపీఎల్‌లో సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న రోహిత్.. ఇండియా-ఏ, అండర్-19 కోచ్‌గా తనదైన ముద్ర వేసిన ద్రవిడ్ కాంబినేషన్‌లో టీమిండియా తొలి విజయం అందుకుంటుందో చూడాలి. సక్సెస్‌కు మారుపేరైన వీరిద్దరూ కలిసి జట్టుని ఏ విధంగా ముందుకు తీసుకెళతారనేదిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీ20 ప్రపంచకప్ 2021 అనంతరం టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ పదవి నుంచి రవిశాస్త్రి తప్పుకోవడంతో నయా సారథిగా రోహిత్, కోచ్‌గా ద్రవిడ్‌లను బీసీసీఐ నియమించిన సంగతి తెలిసిందే. సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో భారీ స్కోర్లు ఖాయమని అంటున్నారు. గత ఎనిమిదేళ్లలో ఇక్కడ భారత్ ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. ఇక్కడ టీ20 మ్యాచ్‌ జరగడం ఇదే తొలిసారి.

తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), లోకేష్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (కీపర్), వెంకటేష్ అయ్యర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, దీపక్ చహర్, భువనేశ్వర్ కుమార్‌, మహ్మద్ సిరాజ్.
న్యూజిలాండ్‌: మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫెర్ట్(కీపర్), రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, టీమ్ సౌథీ (కెప్టెన్), టాడ్ ఆస్టిల్, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్.

Story first published: Wednesday, November 17, 2021, 18:56 [IST]
Other articles published on Nov 17, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+