
డెర్బిషైర్‌పై..
తొలుత బ్యాటింగ్ చేసిన డెర్బిషైర్ జట్టు 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల 150 పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లెవరూ భారీ స్కోర్ చేయలేకపోయారు. 28 పరుగులు చేసిన వేన్ మ్యాడ్సెన్ ఒక్కడే టాప్ స్కోరర్. కేప్టెన్ షాన్ మసూద్-8, లూయిస్ రీస్-1,లెస్ డు ప్లూయ్-9, హిల్టర్ కార్ట్‌రైట్-27, బ్రూక్ గెస్ట్-23, అలెక్స్ హగ్స్-24, మ్యాటీ మెక్‌కెర్నెన్-20, మార్క్ వాట్-3 పరుగులు చేశారు. టీమిండియాలో బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ 31 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టాడు.

యంగ్ క్రికెటర్ల దూకుడు..
అక్షర్ పటేల్, వెంకటేష్ అయ్యర్ ఒక్కో వికెట్ కూల్చారు. లక్ష్యాన్ని ఛేదించడానికి పెద్దగా శ్రమించాల్సిన అవసరం రాలేదు. తొలి ఓవర్‌లోనే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అవుట్ అయినప్పటికీ.. టాప్ ఆర్డర్ సత్తా చాటింది. మరో ఓపెనర్ సంజు శాంసన్ 30 బంతుల్లో ఒక సిక్స్, నాలుగు ఫోర్లతో 38, దీపక్ హుడా 37 బంతుల్లో రెండు సిక్సర్లు, అయిదు ఫోర్లతో 59 పరుగులు చేశారు. సూర్యకుమార్ యాదవ్ 22 బంతుల్లో ఒక సిక్స్, నాలుగు ఫోర్లతో 36 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

మరో వార్మప్
ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లల్లో భాగంగా ఇవ్వాళ యంగ్ టీమిండియా- రెండో టీ20 ప్రాక్టీస్ మ్యాచ్‌ను ఆడబోతోంది. నార్తాంప్టన్‌షైర్‌తో తలపడనుంది. భారత కాలమానం ప్రకారం.. ఈ సాయంత్రం 7 గంటలకు ఆరంభమౌతుంది. నార్తాంప్టన్ కౌంటీ గ్రౌండ్ దీనికి వేదిక. నార్తాంప్టన్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో ఈ మ్యాచ్‌ను లైవ్ టెలికాస్ట్ చూడొచ్చు. ఈ పిచ్‌పై 170 పరుగులు చేసిన జట్టు గెలిచే అవకాశం ఉంది.

తుదిజట్లు ఇవే..
ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడే జట్టుకు దినేష్ కార్తీక్ నాయకత్వాన్ని వహిస్తోన్నాడు. హార్దిక్ పాండ్యా విశ్రాంతి ఇచ్చారు. ఇవ్వాళ్టి మ్యాచ్ ఆడబోయే తుదిజట్టులో రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా, సూర్యకుమార్ యదవ్, సంజు శాంసన్, వెంకటేష్ అయ్యర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్ ఆడే అవకాశం ఉంది. నార్తాంప్టన్‌షైర్ టీమ్‌లో జోషువా కాబ్ (కేప్టెన్), బెన్ కుర్రన్, ర్యాన్ రిక్కెల్టన్, అలెక్స్ రస్సెల్, బ్రెండన్ గ్లోవర్, నాథన్ బక్, ఎమిలియోగే, ఛార్లీ థర్స్టన్, సైఫ్ జైబ్, జేమ్స్ సేల్స్, రికార్డో వాస్కొన్సెలాస్ ఆడొచ్చు.


Click it and Unblock the Notifications












