
విమర్శలకు చెక్..
విరాట్ కోహ్లీ సత్తాకు నిలువుటద్దంలా మారిందీ ఇన్నింగ్. చివరి రెండు ఓవర్లల్లో 30కి పైగా పరుగులను పిండుకున్నాడు కింగ్ కోహ్లీ. 19వ ఓవర్‌లో బాదిన రెండు సిక్సర్లు కూడా హిస్టరీకెక్కాయి. ఈ రెండింటీనీ ప్రశంసించనివాడంటూ లేడు. ప్రతి ఒక్కరు కూడా అతని నుంచి ఇలాంటి ఇన్నింగ్‌ను ఆశించారు. కొన్ని నెలలుగా ఫామ్‌ను కోల్పోయి తీవ్ర విమర్శలకు గురైన కోహ్లీపై ఒక దశలో వేటు పడుతుందనే అంచనాలు సైతం వ్యక్తం అయ్యాయి. అలాంటి దశ నుంచి ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించే స్థాయికి ఎదిగాడు కోహ్లీ.

విరాట్ పైనే..
టీమిండియా తన తదుపరి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను ఎదుర్కొనబోతోంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ దీనికి వేదిక. సాయంత్రం 4:30 గంటలకు మొదలవుతుందీ పోరు. ఈ నేపథ్యంలో- అందరి కళ్లూ విరాట్ కోహ్లీ మీదే ఉన్నాయి. బలమైన పాకిస్తాన్ బౌలర్లనే ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన కోహ్లీ- నెదర్లాండ్స్ మీద ఎలా విరుచుకుపడతాడనేది చర్చనీయాంశమౌతోంది. ఈ మ్యాచ్‌లో కూడా పరుగుల వరద పారిస్తాడనే అంచనాలు ఉన్నాయి.

అలాంటి ఇన్నింగ్ వద్దు బాబోయ్..
ఈ పరిణామాల మధ్య నెదర్లాండ్స్ కేప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్‌పై శివాలెత్తిన విరాట్ కోహ్లీ- అదే ఆటతీరును రిపీట్ చేయాలని కోరుకోవట్లేదని చెప్పాడు. అలాంటి ఇన్నింగ్ ఆడకూడదని ఆశిస్తున్నానని పేర్కొన్నాడు. పాకిస్తాన్‌పై విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్ ఓ విధ్వంసం లాంటిదని, అతని శక్తి సామర్థ్యాలు, దూకుడుకు అది రిఫ్లెక్ట్ అయిందని చెప్పాడు.

ఒత్తిళ్లు లేవు..
తాము గెలుస్తామనే అంచనాలు ఎవరికీ లేవని, అందుకే తమపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని స్కాట్ ఎడ్వర్డ్స్ చెప్పాడు. టీ20 ప్రపంచకప్ వంటి బిగ్గెస్ట్ టోర్నమెంట్స్‌లల్లో ఆడటం వల్ల తమ జట్టుకు మంచి అనుభవం లభిస్తుందని, ఎందరో స్టార్ క్రికెటర్లతో ఆడటం- తమ జట్టుకు మేలు చేస్తుందని అన్నాడు. ఇవన్నీ భవిష్యత్తులో నెదర్లాండ్స్ క్రికెట్ డెవలప్‌మెంట్‌కు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు. గెలవడానికి శక్తివంచన లేకుండా కృషి చేయడమే తమ చేతుల్లో ఉందని వ్యాఖ్యానించాడు. భారత్ వంటి జట్టును ఎదుర్కొనడం తమకు ఓ కల అని, దాన్ని నెరవేర్చుకుంటోండటం సంతోషాన్నిస్తోందని చెప్పాడు.


Click it and Unblock the Notifications












