
భారత్ ఘన విజయం:
మొత్తానికి టీ20 ప్రపంచకప్ 2021 టోర్నీని భారత్ ఘన విజయంతో ముగించింది. నామమాత్రమైన ఆఖరి మ్యాచ్‌లో నమీబియాపై కోహ్లీసేన 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. బ్యాటర్లు, బౌలర్లు ఆధిపత్యం కనబరిచిన వేళ.. భారత్ సునాయాస విజయంతో ఇంటిముఖం పట్టింది. వరుసగా మూడు ఘన విజయాలు సాధించినా.. సెమీస్ బెర్తు సాధించలేకపోయింది. గ్రూప్-2 నుంచి పాకిస్తాన్, న్యూజిలాండ్ సెమీస్‌కు చేరుకున్నాయి. టీ20 ప్రపంచకప్ తర్వాత టీ20 జట్టు పగ్గాలను వదిలేస్తానని ప్రకటించిన విరాట్ కోహ్లీకి, హెడ్ కోచ్‌గా పదవీకాలం ముగిసిన రవిశాస్త్రికి ఈ విజయం ఘన వీడ్కోలు అని చెప్పొచ్చు.

రోహిత్ ఔటైనా:
స్వల్ప లక్ష్య ఛేదనలోభారత్ కేవలం ఒక్క వికెట్‌ను మాత్రమే కోల్పోయి 15.2 ఓవర్లలో 136 పరుగుల చేసి విజయం గెలుపొందింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (56), కేఎల్ రాహుల్ (54 నాటౌట్) ధాటిగా ఆడేశారు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరిగెత్తించాడు. ఈ జోడి తొలి వికెట్‌కు అర్ధ శతక (86) భాగస్వామ్యం నిర్మించారు. అయితే రోహిత్ ఔటైనా.. పరుగుల వేగం మాత్రం తగ్గలేదు. అనంతరం సూర్యకుమార్ యాదవ్ (25: నాలుగు ఫోర్లు)తో కలిసి రాహుల్ లాంఛనాన్ని పూర్తి చేశాడు. నమీబియా బౌలర్ ఫ్రైలింక్ ఒక వికెట్ తీశాడు.

విఫలమైన నమీబియా బ్యాటర్లు
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియాను భారత్ బౌలర్లు 132/8 పరుగులకే కట్టడి చేశారు. డేవిడ్ వైజ్ (26), బార్డ్ (21) తప్ప మిగతా అందరూ విఫలమయ్యారు. నమీబియా బ్యాటర్లలో మైకెల్ 14, క్రెయిగ్ డకౌట్, ఎరాస్మస్ 12, జాన్ నికోల్ 5, స్మిత్ 9, ఫ్రైలింక్ 15*, రుబెన్ 13 పరుగులు చేశారు. 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన నమీబియాను కెప్టెన్ ఎరాస్మస్‌తో కలిసి వైజ్ కాస్త ఆదుకున్నాడు. అయితే స్వల్ప వ్యవధిలో వికెట్లను కోల్పోవడంతో నమీబియా ఇబ్బందుల్లో పడింది. చివర్లో ఫ్రైలింక్, రుబెన్ ధాటిగా ఆడటంతో నమీబియా స్కోరు 130 దాటింది. భారత బౌలర్లలో జడేజా 3, అశ్విన్ 3, బుమ్రా 2 వికెట్లు పడగొట్టారు. 4 ఓవర్లు వేసి కేవలం 16 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీసిన రవీంద్ర జడేజాకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' వరించింది.

రోహిత్ రికార్డు:
ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ రెండు రికార్డులు క్రియేట్ చేశాడు. టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో 3000 మైలురాయిని క్రాస్ చేశాడు. అలాగే హాఫ్ సెంచరీ చేసి మరో రికార్డు సృష్టించాడు. టీ20 వప్రపంచకప్‌లో టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి ఇదే చివరి మ్యాచ్. టీ20 ఇంటర్నేషనల్‌లో కెప్టెన్‌గా తనకు ఇదే చివరి టోర్నీ అని విరాట్ కోహ్లీ ముందే ప్రకటించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications












