Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NAM: మూడేసిన అశ్విన్, జడేజా.. టీమిండియా విజయ లక్ష్యం ఎంతంటే?

IND vs NAM: Ravichandran Ashwin, Ravindra Jadeja 3-fers limit Namibia to 132

దుబాయ్‌: టీ20 ప్రపంచకప్‌ 2021 సూప‌ర్ 12లో భాగంగా నమీబియాతో జరుగుతోన్న నామమాత్రపు మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు సత్తాచాటారు. స్పిన్నర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా చేరో మూడో వికెట్లు పడగొట్టి నమీబియాను నిలువరించారు. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి న‌మీబియా 132 ప‌రుగులు చేసింది. దాంతో భారత్ లక్ష్యం 133గా ఉంది. న‌మీబియా ప్లేయ‌ర్ల‌లో డేవిడ్ వీస్‌.. టీమ్‌ను ఆదుకున్నాడు. 25 బంతుల్లో రెండో ఫోర్ల సాయంతో 26 పరుగులు చేశాడు. చివ‌ర్లో బ్యాటింగ్‌కు వ‌చ్చిన ట్రంపెల్‌మాన్ 6 బంతుల్లో 13 ప‌రుగులు చేశాడు. భార‌త బౌల‌ర్ల‌లో జ‌డేజా, అశ్విన్ చెరో మూడు వికెట్లు తీయ‌గా.. జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు తీశాడు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా.. నెమ్మదిగా పరుగులు చేసింది. ఓపెనర్లు స్టీఫెన్ బైర్డ్ (21), మైఖేల్ వాన్‌ లింగెన్ (14) ఆచితూచి ఆడారు. జట్టు స్కోరును పెంచే ప్రయత్నం చేస్తూ వచ్చారు. అయితే జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో లింజెన్‌ అవుట్‌ కావడంతో నమీబియా స్కోరుకు బ్రేకులు పడ్డాయి. ఆపై నమీబియా వరుస వికెట్లు కోల్పోయింది. విలియమ్స్‌ (0), జేన్ గ్రీన్ (0) బ్యాక్‌ టు బ్యాక్‌ పెవిలియన్‌ బాటపట్టారు. 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన నమీబియాను కెప్టెన్‌ ఎరాస్మస్‌తో కలిసి వైజ్ కాస్త ఆదుకున్నాడు. అయితే స్వల్ప వ్యవధిలో వికెట్లను కోల్పోవడంతో నమీబియా ఇబ్బందుల్లో పడింది. చివర్లో ఫ్రైలింక్, రుబెన్ ధాటిగా ఆడటంతో నమీబియా స్కోరు 130 దాటింది. భారత బౌలర్లలో జడేజా 3, అశ్విన్‌ 3, బుమ్రా 2 వికెట్లు పడగొట్టారు.

భారత్, నమీబియా మ్యాచ్‌లో ఏ టీమ్ గెలిచినా కూడా పెద్దగా ఉప‌యోగం లేదు. ఎందుకంటే ఇప్ప‌టికే సెమీ ఫైన‌ల్‌కు 4 టీమ్‌లు వెళ్లిపోయాయి. కాక‌పోతే పాయింట్స్ టేబుల్‌లో త‌మ స్థాయిని మార్చుకోవ‌డం త‌ప్పితే.. ఏ టీమ్‌కు కూడా ఈ మ్యాచ్‌ను గెల‌వ‌డంతో వచ్చే లాభమే లేదు. రెండు టీమ్స్ ఈ మ్యాచ్ ముగిశాక ఇంటి దారి ప‌ట్టాల్సిందే. సెమీ ఫైన‌ల్స్‌కు గ్రూప్ 1 నుంచి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్వాలిఫై కాగా.. గ్రూప్ 2 నుంచి పాకిస్థాన్‌, న్యూజిలాండ్ వెళ్లాయి. న‌వంబ‌ర్ 10న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మ‌ధ్య సెమీస్‌ మ్యాచ్ జరగనుండగా.. న‌వంబ‌ర్ 11న పాకిస్థాన్, ఆస్ట్రేలియా మ‌ధ్య మ్యాచ్ జరగనుంది. ఈ రెండు మ్యాచ్‌ల‌లో విజ‌యం సాధించిన టీమ్స్ మ‌ధ్య న‌వంబ‌ర్ 14న పైన‌ల్ జ‌ర‌గ‌నుంది.

Story first published: Monday, November 8, 2021, 21:39 [IST]
Other articles published on Nov 8, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+