Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NAM: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి! కోహ్లీకే ఇదే చివరి మ్యాచ్!

IND vs NAM Playing 11 is out: Varun Chakravarthy in and Rahul Chahar out

దుబాయ్: టీ20 ప్రపంచకప్‌ 2021లో సూపర్ 12 రౌండ్ సోమవారం (నవంబర్ 8) చివరి దశకు చేరుకుంది. మరికొద్ది సేపట్లో సూపర్ 12 చివరి మ్యాచ్ భారత్, నమీబియా జట్ల మధ్య జరగనుంది. రెండు జట్లు సెమీఫైనల్ రేసులో లేనందున ఈ మ్యాచ్ నామమాత్రమే అయింది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత్ ఈ మ్యాచ్ కోసం ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. వరుణ్ చక్రవర్తి స్థానంలో రాహుల్ చహర్ జట్టులోకి వచ్చాడు. సారథిగా కోహ్లీకి ఇదే చివరి మ్యాచ్ అన్న విషయం తెలిసిందే. మొత్తంగా భారత్ ముగ్గురు స్పిన్నర్లతో ఆడనుంది. మరోవైపు నమీబియా కూడా ఒక మార్పు చేసింది. బిర్కెన్‌స్టాక్ స్థానంలో జాన్ ఫ్రైలింక్ తుది జట్టులోకి వచ్చాడు.

భారత్, నమీబియా మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లలో వివిధ భాషల్లో చూడవచ్చు. డిస్నీ+హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ సబ్‌స్క్రిప్షన్‌తో కూడా మ్యాచ్‌ను ఆన్‌లైన్‌లో వీక్షించవచ్చు. టీ20 ఫార్మాట్లో భారత్, నమీబియా జట్ల మధ్య మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్ భారత్ గెలిచేందుకే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి.

భారత్, నమీబియా మ్యాచ్‌లో ఏ టీమ్ గెలిచినా కూడా పెద్దగా ఉప‌యోగం లేదు. ఎందుకంటే ఇప్ప‌టికే సెమీ ఫైన‌ల్‌కు 4 టీమ్‌లు వెళ్లిపోయాయి. కాక‌పోతే పాయింట్స్ టేబుల్‌లో త‌మ స్థాయిని మార్చుకోవ‌డం త‌ప్పితే.. ఏ టీమ్‌కు కూడా ఈ మ్యాచ్‌ను గెల‌వ‌డంతో వచ్చే లాభమే లేదు. రెండు టీమ్స్ ఈ మ్యాచ్ ముగిశాక ఇంటి దారి ప‌ట్టాల్సిందే. సెమీ ఫైన‌ల్స్‌కు గ్రూప్ 1 నుంచి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్వాలిఫై కాగా.. గ్రూప్ 2 నుంచి పాకిస్థాన్‌, న్యూజిలాండ్ వెళ్లాయి. న‌వంబ‌ర్ 10న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మ‌ధ్య సెమీస్‌ మ్యాచ్ జరగనుండగా.. న‌వంబ‌ర్ 11న పాకిస్థాన్, ఆస్ట్రేలియా మ‌ధ్య మ్యాచ్ జరగనుంది. ఈ రెండు మ్యాచ్‌ల‌లో విజ‌యం సాధించిన టీమ్స్ మ‌ధ్య న‌వంబ‌ర్ 14న పైన‌ల్ జ‌ర‌గ‌నుంది.

తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చహర్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా.
నమీబియా: స్టీఫెన్ బైర్డ్, మైఖేల్ వాన్‌ లింగెన్, క్రెయిగ్ విలియమ్స్, గెర్హార్డ్ ఎరాస్మస్ (కెప్టెన్), జేన్ గ్రీన్ (వికెట్ కీపర్), డేవిడ్ వీసా, జాన్‌ ఫ్రైలింక్‌, జేజే స్మిత్, జాన్‌ నికోల్ లాఫ్టీ-ఈటన్, రూబెన్ ట్రంపెల్‌మాన్, బెర్నార్డ్ స్కోల్ట్జ్‌.

Story first published: Monday, November 8, 2021, 19:28 [IST]
Other articles published on Nov 8, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+