Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs IRE: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ మధ్య వాగ్వాదం! (వీడియో)

IND vs IRE: భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య నేటి సాయంత్రం 6 గంటల నుంచి బెల్ఫాస్ట్ వేదికగా మొదటి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ద్వారా టీమిండియా యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసే అవకాశం ఉండటంతో అందరి ఫోకస్ అతడిపైనే ఉంది. అయితే ఈ తొలి మ్యాచ్‌కు ముందు టీమిండియా ప్రాక్టీస్ సెషన్లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. నెట్ ప్రాక్టీస్ సందర్భంగా వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ మధ్య జరిగిన ఓ ఫన్నీ వాగ్వాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

"నువ్వు ఔట్ అంటే.. ఔట్ కాదు".. నెట్స్‌లో వాగ్వాదం!
ఈ టీ20 సిరీస్ కోసం టీమిండియాలో కెప్టెన్సీ, వైస్ కెప్టెన్సీ బాధ్యతలతో పాటు జట్టులో పలు మార్పులు జరిగాయి. నెట్ ప్రాక్టీస్ సమయంలో వైభవ్ సూర్యవంశీ స్పిన్ బౌలింగ్ చేస్తూ కనిపించాడు. ఈ క్రమంలో వైభవ్ భారత ఓపెనర్ అభిషేక్ శర్మకు బౌలింగ్ చేశాడు. వైభవ్ వేసిన ఓ బంతిని అభిషేక్ శర్మ భారీ షాట్ ఆడగా.. ఆ బంతి కాస్తా పైనున్న నెట్‌కు తగిలింది. దీంతో వైభవ్ సూర్యవంశీ వెంటనే ఔట్ అంటూ అప్పీల్ చేశాడు. కానీ అభిషేక్ శర్మ మాత్రం ఔట్ కాలేదని చివరి వరకు వాదించాడు. ఆ తర్వాత అభిషేక్ బ్యాటింగ్ ముగించుకుని పక్కకు వెళ్లినప్పటికీ.. తను ఔట్ కాలేదంటూ వైభవ్ సూర్యవంశీకి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ ఫన్నీ తగాదాకు సంబంధించిన వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. భారత్, ఐర్లాండ్ మధ్య జరిగే ఈ రెండు టీ20ల సిరీస్‌ను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు.

IND vs IRE Vaibhav Sooryavanshi and Abhishek Sharma Funny On-Field Banter Video Goes Viral

వైభవ్ సూర్యవంశీతో కలిసి ఓపెనింగ్ చేసేది ఎవరు?
ఈ సిరీస్‌లో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు ఎదురవుతున్న అతిపెద్ద సవాల్ ఏమిటంటే.. వైభవ్ సూర్యవంశీకి జోడీగా ఓపెనింగ్‌కు ఎవరిని పంపాలనేది. గత టీ20ల్లో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఓపెనర్లుగా వచ్చి సఫలీకృతం అయ్యారు. రైట్-లెఫ్ట్ కాంబినేషన్‌కు కూడా వీరు సరిగ్గా సరిపోయారు. కానీ ఇప్పుడు జట్టులోకి వైభవ్ సూర్యవంశీ రావడంతో.. టీమిండియాలో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, వైభవ్‌లతో కలిపి ముగ్గురు లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్లు అయ్యారు. ఈ సమీకరణాల నేపథ్యంలో, ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీతో కలిసి సంజూ శాంసన్ ఓపెనింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఐర్లాండ్ సిరీస్ కోసం భారత జట్టు:
శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివం దూబే, అక్షర్ పటేల్, సూర్యాన్ష్ షెడ్గే, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్.

Story first published: Friday, June 26, 2026, 14:59 [IST]
Other articles published on Jun 26, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+