IND VS IRE : పతంగులు ఎగరేస్తూ.. మహిళా క్రికెటర్ల సంక్రాంతి సంబరాలు (వీడియో వైరల్)
దేశవ్యాప్తంగా సంక్రాంతి శోభ నెలకొంది. సంక్రాంతి అంటేనే మనకు టక్కున గుర్తొచ్చేది గాలిపటాలే. ఆ రంగురంగుల పతంగులు పైకెళ్లేకొద్దీ మన సంతోషం కూడా అంత ఎక్కువవుతుంటుంది.! అందుకే ఎప్పటిలాగే ఈ సంక్రాంతి కూడా చాలా మంది పతంగులు ఎగరేస్తూ పండగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే భారత మహిళా క్రికెటర్లు కూడా పతంగులను ఆకాశంలో ఎగరేస్తూ పండగను ఎంతో ఉత్సాహంతో జరుపుకున్నారు. ఐర్లాండ్ మహిళా జట్టు కూడా మన అమ్మాయిలతో కలిసి కైట్స్ ను ఎగరేస్తూ సందడి చేశారు. నిర్ణయాత్మక మూడో వన్డే మ్యాచ్ కు ముందు ఇరు జట్లు కలిసి ఎంతో ఉత్సాహంతో మకర సంక్రాంతి పండగను సెలబ్రేట్ చేసుకున్నారు.

దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తన అధికార సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. "రాజ్ కోట్ లో టీమిండియా - టీమ్ ఐర్లాండ్ ఆన్ ఫెస్టివ్ మోడ్" అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇందులో ఇరు జట్ల ఆటగాళ్లు తాము బసచేసే హోటల్ ఆకాశంలోకి పతంగలు ఎగురవేస్తూ సందడి చేశారు. పోటీ పడుతూ మరీ కైట్స్ ను ఎగురేశారు. అలానే ఇరు జట్లు తమ మధ్య ఉన్న అనుబంధాన్ని కూడా తెలియజేశారు.
కాగా, ప్రస్తుతం భారత మహిళల క్రికెట్ జట్టు సొంత గడ్డపై - ఐర్లాండ్ మహిళల జట్టుతో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్, మూడు మ్యాచుల వన్డే సిరీస్ ఆడుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో ఇప్పటికే టీ20 సిరీస్ ను 2-1 తేడాతో దక్కించుకున్న భారత జట్టు... వన్డే సిరీస్ లోనూ వరుసగా రెండో మ్యాచ్ గెలిచి 2-0 తేడాతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు నిర్ణయాత్మక మూడో మ్యాచ్ కోసం సిద్ధం అవుతోంది. ఈ మ్యాచ్ రాజ్ కోట్ వేదికగా జనవరి 15న జరగనుంది.
Story first published: Wednesday, January 15, 2025, 11:04 [IST]
Other articles published on Jan 15, 2025
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications