IND vs IRE: వైభవ్ సూర్యవంశీ మాత్రమే కాదు.. జట్టులోకి రాజస్థాన్ కుర్రాడు!
IND vs IRE: భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య జరగబోయే టీ20 సిరీస్‌కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్లో ఓ అరుదైన, ఆసక్తికర ఘట్టం చోటుచేసుకోబోతోది. ఈ సిరీస్‌లో అందరి దృష్టి 15 ఏళ్ల భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం పైనే ఉండగా.. మరోవైపు భారత్‌లో జన్మించిన ఓ ఆటగాడు ప్రత్యర్థి జట్టు ఐర్లాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు. రాజస్థాన్‌కు చెందిన యువ పేసర్ జయ్ ముంద్రాకు ఐర్లాండ్ జాతీయ జట్టులో చోటు దక్కింది. జూన్ 26 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్‌లో జయ్ ముంద్రా భారత్‌కు వ్యతిరేకంగానే తన అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించే అవకాశం ఉంది.
భారత్‌లో పుట్టి.. ఐర్లాండ్ జట్టులోకి ఎలా వెళ్లాడంటే?
రాజస్థాన్‌లోని టోంక్ జిల్లాకు చెందిన 28 ఏళ్ల జయ్ ముంద్రా లెఫ్టార్మ్ పేసర్ కావడం గమనార్హం. జయ్ ముంద్రా ఉన్నత చదువుల కోసం 2021లో ఎంటెక్ చదవడానికి స్టూడెంట్ వీసాపై ఐర్లాండ్ వెళ్లాడు. అక్కడ చదువుకుంటూనే ఉద్యోగం చేస్తూ, స్థానిక క్లబ్ క్రికెట్‌లో ఆడటం కొనసాగించాడు. క్లబ్ క్రికెట్‌లో నిలకడగా అద్భుతమైన ప్రదర్శన చేయడంతో ఐర్లాండ్ సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత 2025లో అతనికి ఐర్లాండ్ పౌరసత్వం లభించింది. జయ్ ముంద్రా ప్రతిభ, దూకుడుగా ఉండే బౌలింగ్ శైలితో పాటు లోయర్ ఆర్డర్‌లో ఉపయోగపడే బ్యాటింగ్ సామర్థ్యాన్ని గుర్తించిన బోర్డు.. తాజాగా భారత్‌తో జరిగే టీ20 సిరీస్ కోసం అతడిని జాతీయ జట్టుకు ఎంపిక చేసింది.

కుటుంబంలో పండగ వాతావరణం!
జయ్ ముంద్రా ఐర్లాండ్ జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడనే వార్త తెలియగానే అతని సొంత ఊరైన రాజస్థాన్‌లోని టోంక్ జిల్లాలో పండగ వాతావరణం నెలకొంది. అతని కఠోర శ్రమ, క్రికెట్ పట్ల ఉన్న అంకితభావమే అతడిని ఈ స్థాయికి చేర్చాయని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జయ్ ముంద్రా ఇంటికి బంధువులు, స్థానికుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ ఆడే స్థాయికి చేరుకుని తన కొడుకు కుటుంబ కలని నిజం చేశాడని జయ్ తల్లి భావోద్వేగానికి గురయ్యారు.
షెడ్యూల్
భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జూన్ 26, 28 తేదీలలో జరగనుంది. ఇటీవల టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత భారత జట్టు ఆడబోతున్న మొదటి టీ20 అంతర్జాతీయ సిరీస్ ఇదే కావడం విశేషం. ఈ సిరీస్ ముగిసిన వెంటనే భారత జట్టు ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్ కోసం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది.
ఇరు జట్లు ఇవే..(అంచనా)
భారత్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), సూర్యాంశ్ షెడ్గే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ.
ఐర్లాండ్: లోర్కాన్ టక్కర్ (కెప్టెన్), రాస్ అడైర్, బెన్ కాలిట్జ్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, స్టీఫెన్ డోహెనీ, మాథ్యూ హంఫ్రీస్, గావిన్ హోయ్, మాథ్యూ హోలార్డ్, లియామ్ మెక్‌కార్తీ, జయ్ ముంద్రా, హ్యారీ టెక్టర్, టిమ్ టెక్టర్, రూబెన్ వెక్టర్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications