తాటతీస్తాం: బుడ్డోడికి ఐర్లాండ్ కెప్టెన్ ఓపెన్ ఛాలెంజ్!
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం కోసం క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఐపీఎల్ 2026లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీ.. ఆ తర్వాత జరిగిన ముక్కోణపు సిరీస్‌లోనూ పరుగుల వరద పారించిన సంగతి తెలిసిందే. తాజాగా ఐర్లాండ్ పర్యటనలో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రానికి సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ గురించి ఐర్లాండ్ కెప్టెన్ లోర్కాన్ టక్కర్ చేసిన ఇట్రెస్టింగ్ కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి.
ప్రొఫెషనల్ క్రికెట్లో 15 ఏళ్ల కుర్రాడా? నమ్మలేకపోతున్నా..
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రతిభను ఐర్లాండ్ కెప్టెన్ లోర్కాన్ టక్కర్ కొనియాడాడు. "కేవలం 15 ఏళ్ల వయసున్న ఓ ఆటగాడు టీమిండియా లాంటి బలమైన జట్టులో చోటు దక్కించుకోవడం నిజంగా అద్భుతమైన విషయం. క్రికెట్ ప్రమాణాలు, ఆటగాళ్ల ఫిట్‌నెస్ స్థాయిలు ఇంతగా పెరిగిన ఈ ఆధునిక ప్రొఫెషనల్ క్రికెట్ యుగంలో.. ఇంత చిన్న వయసులోనే ఒకరు అంతర్జాతీయ స్థాయికి వస్తారని నేను అస్సలు ఊహించలేదు. దీనికిగానూ ఆ కుర్రాడికి దక్కాల్సిన క్రెడిట్ కచ్చితంగా దక్కాలి" అని లోర్కాన్ టక్కర్ ప్రశంసించాడు.

వైభవ్ పార్టీని పాడు చేయడంలోనే మాకు మజా ఉంటుంది!
ప్రశంసలు కురిపిస్తూనే మైదానంలో మాత్రం తాము వైభవ్ సూర్యవంశీకి ఎలాంటి మినహాయింపులు ఇవ్వబోమని ఐర్లాండ్ కెప్టెన్ స్పష్టం చేశాడు. "వైభవ్ సూర్యవంశీ చాలా ప్రత్యేకమైన ఆటగాడు. ఈ రోజు అతడు అరంగేట్రం చేస్తాడని మేమంతా భావిస్తున్నాం, అది అతడి జీవితంలోనే అతిపెద్ద క్షణం కాబోతోంది. కానీ ఓ ప్రత్యర్థి జట్టుగా వైభవ్ అరంగేట్రం మ్యాచ్‌ను పాడు చేయడానికి మేము ప్రయత్నిస్తాం. ఆ మ్యాచ్‌పై మా ముద్ర వేసి, అతడి అరంగేట్రం పార్టీని చెడగొట్టడంలోనే మాకు అసలైన మజా ఉంటుంది" అని లోర్కాన్ టక్కర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.
తుది జట్టులో వైభవ్‌కు చోటు దక్కడం ఈజీనా?
వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్‌లోనే అరంగేట్రం చేయడం అంత సులభం కాదు. ఎందుకంటే ప్రస్తుతం భారత టాపార్డర్‌లో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ లాంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యులుగా ఉన్న వీరి ముగ్గురి స్థానాలు దాదాపు ఖాయంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 15 ఏళ్ల వైభవ్‌కు తుది జట్టులో అవకాశం ఇవ్వాలంటే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇద్దరిలో ఒకరిని పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ కుదరకపోతే.. వైభవ్ తన అరంగేట్రం కోసం ఇంగ్లండ్ సిరీస్ వరకు వేచి చూడాల్సి రావచ్చు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications