IND vs IRE: వైభవ్ ఎంట్రీ.. సంజూ అవుట్? టీమిండియాలో భారీ మార్పులు!
IND vs IRE: బెల్ఫాస్ట్‌లో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో ఐర్లాండ్ చేతిలో 34 పరుగుల తేడాతో ఊహించని పరాజయాన్ని చవిచూసిన టీమిండియా.. నేడు(జూన్ 28) జరగబోయే రెండో చివరి మ్యాచ్‌లో సిరీస్‌ను సమం చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. భారత కాలమానం ప్రకారం.. సాయంత్రం 6 గంటలకు సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్ మైదానంలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఐర్లాండ్ చేతిలో భారత్ ఓడిపోవడం ఇదే తొలిసారి కావడంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని యువ భారత్ ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది.
తొలి మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ ఘోరంగా విఫలమైంది. 183 పరుగుల లక్ష్య ఛేదనలో టాపార్డర్ భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోవడంతో భారత్ 148 పరుగులకే కుప్పకూలింది. ఈ నేపథ్యంలోనే రెండో టీ20 కోసం తుది జట్టులో భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో అందరి కళ్లు 5 ఏళ్ల ఆటగాడు వైభవ్ సూర్యవంశీ వైపే ఉన్నాయి. మొదటి మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితమైన అతనికి ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసే అవకాశం కల్పించాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది.

భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ జట్టులోకి వస్తే వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ కు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. సంజూ శాంసన్ స్థానంలో వైభవ్ సూర్యవంశీ ఆడించి.. ఇషాన్ కిషన్‌కు వికెట్ కీపింగ్ బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉంది. వైభవ్ సూర్యవంశీతో పాటు మరో ఇద్దరు యువ ఆటగాళ్లు కూడా ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టే అవకాశం కనిపిస్తోంది.
మొదటి మ్యాచ్‌లో ఘోరంగా విఫలమైన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌పై వేటు పడేలా ఉంది. తొలి టీ20లో ఒక ఓవర్లో 19 పరుగులు సమర్పించుకోవడమే కాకుండా బ్యాటింగ్లో కేవలం 9 పరుగులకే ఔటయ్యాడు. వాషింగ్టన్ సుందర్ స్థానంలో స్పిన్నర్ రవి బిష్ణోయ్ లేదా ఇప్పటివరకు అరంగేట్రం చేయని ఆల్‌రౌండర్ సూర్యాంశ్ షెడ్గేలలో ఒకరిని ఎంపిక చేయవచ్చు. అలాగే మొదటి మ్యాచ్‌లో ఏకంగా 57 పరుగులు సమర్పించుకున్న పేసర్ ప్రసిద్ధ్ కృష్ణను పక్కనపెట్టి యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ కు ఛాన్స్ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
మరోవైపు ఐర్లాండ్ జట్టు మొదటి మ్యాచ్ విజయోత్సాహంతో సిరీస్‌ను 1-0తో ఆధిక్యంలో ఉంచుకుంది. భారత్‌పై తొలిసారి చారిత్రాత్మక టి20 సిరీస్ గెలవాలనే పట్టుదలతో ఆతిథ్య జట్టు ఉంది. ఈ క్రమంలో భారత బౌలర్లు మిడిల్ ఓవర్లలో ఐర్లాండ్ పరుగుల వేగాన్ని అడ్డుకోవాల్సి ఉంటుంది. ఈ చారిత్రాత్మక పోరులో తలపడే ఇరు జట్ల అంచనా ప్లేయింగ్-11 ఇలా ఉండవచ్చు.
భారత జట్టు(అంచనా): అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్/సూర్యాంశ్ షెడ్గే, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్.
ఐర్లాండ్ జట్టు(అంచనా): టిమ్ టెక్టర్, రాస్ అడైర్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్ (వికెట్ కీపర్/కెప్టెన్), బెంజమిన్ కాలిట్జ్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, లియామ్ మెక్‌కార్తీ, మాథ్యూ హంఫ్రీస్, జై ముంద్రా, మాథ్యూ హాలార్డ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications