For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వీవీఎస్ లక్ష్మణ్‌కు రవిశాస్త్రి బిగ్ అడ్వైజ్: సన్‌రైజర్స్ బ్యాటర్‌కు ఫుల్ సపోర్ట్

IND vs IRE 2022 T20 series: Ravi Shastri backs Rahul Tripathi to make debut

ముంబై: యంగ్ టీమిండియా టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల ప్రస్థానాన్ని ఆరంభించనుంది. దక్షిణాఫ్రికాతో అయిదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ అనంతరం ఇక విదేశీ పర్యటనల్లో బిజీగా గడపబోతోంది. ఐర్లాండ్, ఇంగ్లాండ్, వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే.. ఇలా టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ వరకూ తీరిక లేని షెడ్యూల్‌ను ఎదుర్కొంటోన్నారు. మూడు నుంచి నాలుగు నెలల పాటు టీమిండియా ప్లేయర్లు అంతర్జాతీయ పర్యటనల్లో బిజీ అయ్యారు.

రేపటి నుంచే..

రేపటి నుంచే..

విదేశీ పర్యటనల్లో భాగంగా తొలి సిరీస్.. ఐర్లాండ్‌తో ఆరంభం కానుంది. దీని తరువాత ఇంగ్లాండ్, వెస్టిండీస్, జింబాబ్వే, శ్రీలంకల్లో పర్యటిస్తుంది. ఐర్లాండ్‌తో రెండు టీ20 ఇంటర్నేషనల్స్ మ్యాచ్‌లను ఆడనుంది భారత క్రికెట్ జట్టు. ఆదివారం తొలి మ్యాచ్ షెడ్యూల్ అయింది. 28వ తేదీన రెండో మ్యాచ్ ఉంటుంది. ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌‌‌లోని మలహిడె స్టేడియం వీటికి వేదిక. భారత కాలమానం ప్రకారం.. రాత్రి 9 గంటలకు మ్యాచ్‌లు ఆరంభమౌతాయి. అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది.

జట్టు ఇదే..

జట్టు ఇదే..

ఐర్లాండ్‌తో ఈ రెండు టీ20 మ్యాచ్‌ల కోసం భారత జట్టుకు ఇదివరకే జట్టును ఎంపిక చేసింది. హార్దిక్ పాండ్యా కేప్టెన్‌గా అపాయింట్ అయ్యాడు. సీనియర్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వైస్ కేప్టెన్. రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, వెంకటేష్ అయ్యర్, అక్షర్ పటేల్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, యజువేంద్ర చాహల్ సెలెక్ట్ అయ్యారు.

డబ్లిన్‌లో..

డబ్లిన్‌లో..

జట్టు ప్లేయర్లు మూడు రోజుల కిందటే డబ్లిన్‌ వెళ్లారు. నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొంటోన్నారు. టీమిండియా రెగ్యులర్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సీనియర్ల జట్టుతో కలిసి ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నందున.. ఐర్లాండ్‌తో సిరీస్‌కు కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ అపాయింట్ అయ్యాడు. లక్ష్మణ్ కోచ్ అవతారం ఎత్తడం ఇదే తొలిసారి. కాగా ఐర్లాండ్‌తో సిరీస్‌కు ముందు టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. లక్ష్మణ్‌కు కొన్ని సలహాలు ఇచ్చాడు.

 రాహుల్ త్రిపాఠికే..

రాహుల్ త్రిపాఠికే..

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న రాహుల్ త్రిపాఠికి అవకాశం ఇవ్వాలని సూచించారు. ఐర్లాండ్‌తో మ్యాచ్‌కు రాహుల్ త్రిపాఠిని తుదిజట్టులోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. త్రిపాఠికి షాట్ మేకింగ్ ఎబిలిటీ ఉందని, ఏ పొజీషన్‌లో అయినా ఆడగలుగుతాడని రవిశాస్త్రి చెప్పారు. ఎలాంటి బౌలర్నయినా ఎదుర్కొనగలుగుతాడని పేర్కొన్నారు. రాహుల్ త్రిపాఠి క్రీజ్‌లో ఉంటే స్కోర్‌బోర్డు పరుగులెత్తుతుందని వ్యాఖ్యానించారు.

 ఐపీఎల్‌లో దూకుడు..

ఐపీఎల్‌లో దూకుడు..

ఐపీఎల్ 2022లో రాహుల్ త్రిపాఠి సత్తా చాటిన విషయం తెలిసిందే. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అతను ఈ సీజన్‌లో ఆడిన 14 మ్యాచ్‌లల్లో 413 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి. బ్యాటింగ్ సగటు 37.55. 158.24 స్ట్రైక్ రేట్‌తో తన దూకుడును కొనసాగించాడు. ఆ దూకుడుతోనే రాహుల్ త్రిపాఠి సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఐర్లాండ్‌తో రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు ఎంపికయ్యాడు.

Story first published: Saturday, June 25, 2022, 9:56 [IST]
Other articles published on Jun 25, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+