
10వేల పరుగల క్లబ్‌లోకి రోహిత్ శర్మ
అయితే, అంతర్జాతీయ క్రికెట్‌లో పదివేల పరుగుల మైలురాయి(10, 022 పరుగులు)ని అందుకున్నాడు. ఐర్లాండ్‌తో టీ20కి ముందు 9,925 పరుగులతో ఉన్న రోహిత్ శర్మ, ఆ మ్యాచ్‌లో 75 పరుగుల వ్యక్తిగత స్కోరుకు చేరుకోగానే పదివేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.

మూడు ఫార్మాట్లు కలిపి రోహిత్ శర్మ ఈ ఘనత
దీంతో పదివేల పరుగుల క్లబ్‌లో చేరిన అతికొద్దిమంది ఓపెనర్ల జాబితాలో రోహిత్ శర్మ చోటు దక్కించుకున్నాడు. మూడు ఫార్మాట్లు (టెస్టులు, వన్డేలు, టీ20లు) కలిపి రోహిత్ శర్మ ఈ ఘనత సాధించాడు. ఇప్పటివరకు రోహిత్ శర్మ టెస్టుల్లో 1,479 పరుగులు, వన్డేల్లో 6,594 పరుగులు, టీ20ల్లో 1,949 పరుగులు సాధించాడు.

మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు
ఇందులో వన్డేల్లో 17 సెంచరీలు నమోదు చేసిన రోహిత్ శర్మ, టెస్టుల్లో 3, టీ20ల్లో 2 సెంచరీలు ఉన్నాయి. అంతేకాదు వన్డేల్లో మూడు సార్లు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడు రోహిత్ శర్మనే కావడం విశేషం. ఇక, అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 34,357 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.

అగ్రస్థానంలో సచిన్ టెండూల్కర్
సచిన్ తర్వాత ఈ జాబితాలో శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర 28,016 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. భారత్ నుంచి రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ, ధోని, మహ్మద్ అజారుద్దీన్, సునీల్ గవాస్కర్, యువరాజ్ సింగ్, వీవీఎస్ లక్ష్మణ్, దిలీప్ వెంగ్‌సర్కార్‌లు అంతర్జాతీయ క్రికెట్‌లో 10 వేల పరుగులు చేసిన జాబితాలో ఉన్నారు.


Click it and Unblock the Notifications













