వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై వర్షం దెబ్బ.. మ్యాచ్ రద్దు?
IND vs IRE: భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడేలా కనిపిస్తున్నాడు. శుక్రవారం బెల్ఫాస్ట్‌లోని సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్ మైదానంలో ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే మ్యాచ్ సమయానికి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మ్యాచ్ ద్వారా భారత 15 ఏళ్ల యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేస్తాడని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ వైభవ్‌కు తుది జట్టులో చోటు దక్కినా.. ఈ వర్షం కారణంగా అతడి అరంగేట్రం మ్యాచ్‌కు ఆటంకం కలిగే ప్రమాదం ఉంది.
మ్యాచ్ సమయానికి వర్షం పడే ఛాన్స్?
బీబీసీ వెదర్ రిపోర్ట్ ప్రకారం.. శుక్రవారం బెల్ఫాస్ట్‌లో రోజంతా ఆకాశం మబ్బులతో కూడి ఉంటుంది. మ్యాచ్ జరిగే సమయంలో అక్కడక్కడా చిరుజల్లులు, తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. టాస్ పడే సమయం, మ్యాచ్ జరిగే గంటల్లో వర్షం కురిసే అవకాశం 30 శాతం నుంచి 43 శాతం వరకు ఉన్నట్లు అంచనా వేశారు. ఇక ఉష్ణోగ్రత 22 నుంచి 23 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. వాతావరణం ఆట ఆడటానికి అనుకూలంగానే ఉన్నప్పటికీ.. మధ్యమధ్యలో వచ్చే వర్షపు జల్లులు మ్యాచ్‌ను కాస్త ఇబ్బంది పెట్టవచ్చు.

మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే అవకాశం ఉందా?
ప్రస్తుత వాతావరణ నివేదికల ప్రకారం బెల్ఫాస్ట్‌లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిసే అవకాశం లేదు. పగటిపూట చాలా సమయం పొడిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే ప్రమాదం చాలా తక్కువని క్రీడా పండితులు భావిస్తున్నారు. అయితే వర్షం కారణంగా ఓవర్లను కుదించడం లేదా ఆట మధ్యలో అప్పుడప్పుడు బ్రేకులు పడటం వంటివి జరగొచ్చు. గత కొన్ని రోజులుగా బెల్ఫాస్ట్‌లో వాతావరణం నిమిష నిమిషానికి మారుతుండటంతో కచ్చితమైన అంచనా వేయడం కష్టంగా మారింది. కానీ బలమైన గాలులు వీచే అవకాశం లేకపోవడం ఇరు జట్లకు కాస్త ఉపశమనం కలిగించే విషయమే.
చరిత్ర సృష్టించనున్న వైభవ్ సూర్యవంశీ!
ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న 'బేబీ బాస్' వైభవ్ సూర్యవంశీ గనుక ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగితే క్రికెట్ చరిత్రలో ఓ సరికొత్త రికార్డు నమోదవుతుంది. భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లలో అత్యంత పిన్న వయసులోనే అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన క్రికెటర్‌గా వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టిస్తాడు. టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను ఘనంగా ప్రారంభించాలని పట్టుదలగా ఉండగా.. హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్‌తో భారత్‌కు షాక్ ఇవ్వాలని ఐర్లాండ్ భావిస్తోంది.
మ్యాచ్ ఎప్పుడు? ఎక్కడ చూడాలి?
భారత్, ఐర్లాండ్ మధ్య జరిగే ఈ తొలి టీ20 మ్యాచ్ భారత కాలమానం ప్రకారం శుక్రవారం (జూన్ 26) సాయంత్రం 6:00 గంటలకు ప్రారంభమవుతుంది. సాయంత్రం 5:30 గంటలకు టాస్ పడుతుంది. ఈ మ్యాచ్ లైవ్ టెలికాస్ట్‌ను భారతదేశంలో 'సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్' ఛానెళ్లలో వీక్షించవచ్చు. అలాగే మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌లలో చూడాలనుకునే వారు 'సోనీ లివ్' యాప్, వెబ్‌సైట్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్‌ను ఆస్వాదించవచ్చు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications