Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: కుర్రాళ్లు క్యూ కట్టారు..పెద్దోళ్లు ఉండాలి కదా! (Video)

రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా కష్టాల్లో పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు శుభారంభం లభించలేదు. 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. యువ ప్లేయర్లు పెవిలియన్‌కు చేరడానికి పోటీపడ్డారు. యశస్వీ జైస్వాల్ (10; 10 బంతుల్లో), శుభ్‌మన్ గిల్ (డకౌట్; 9 బంతుల్లో)‌ను మార్క్‌వుడ్ బోల్తాకొట్టించాడు.

డిఫెండ్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ బ్యాటింగ్ చేసిన జైస్వాల్ స్లిప్‌లో ఉన్న జో రూట్ చేతికి చిక్కాడు. మరోవైపు గిల్ క్రీజులో వచ్చిన మొదటి నుంచి చురుకుగా కదలలేకపోయాడు. ఇబ్బంది పడుతూ బంతులు ఎదుర్కొన్నాడు. చివరికి మార్క్ వుడ్ వేసిన బంతిని ఫార్వర్డ్ డిఫెండ్‌కు ట్రై చేసి వికెట్ కీపర్, బర్త్‌డే బాయ్ అయిన బెన్ ఫోక్స్ చేతికి చిక్కాడు. గిల్ గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో డకౌటవ్వడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

IND vs ENG: Youngsters failed against Engaland.. should there be seniors in team!

అనంతరం క్రీజులోకి వచ్చిన రజత్ పటిదార్ (5; 15 బంతుల్లో) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. స్పిన్నర్ టామ్ హర్ట్‌లీ బౌలింగ్‌లో చెత్త షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. బంతిని అంచనా వేయడంలో విఫలమై డకెట్‌కు సింపుల్ క్యాచ్ ఇచ్చాడు. ఇలా కుర్రాళ్లంతా చెత్త షాట్లకు పెవిలియన్ చేరుతుండటంతో మరో ఎండ్‌లో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ అసహనం వ్యక్తం చేస్తున్నాడు.

1
58583

ఈ నేపథ్యంలో టీమిండియా ఎంపిక పట్ల నెట్టింట్లో విమర్శలు వస్తున్నాయి. కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఆలోచన బాగానే ఉందని, కానీ సీనియర్లు పూర్తిగా జట్టుకు దూరమైతే పరిస్థితి ఇలానే ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు. ఫామ్‌లో ఉన్న పుజారాను జట్టులోకి ఎందుకు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. సీనియర్లు విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ జట్టుకు దూరమవ్వడంతో యువకులకు అవకాశం ఇచ్చిన తెలిసిందే. అయితే రంజీ ట్రోపీలో రాణిస్తున్న చెతేశ్వర్ పుజారా‌ ఎంపిక అవుతాడని భావించారంతా. కానీ పుజారాకే నిరాశే మిగిలింది.

కాగా, ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నారు. తన సొంతగడ్డపై జరుగుతున్న మూడో టెస్టులో జడేజాపై అంచనాలు, బాధ్యతలు భారీగా పెరిగాయి. గాయంతో రెండో టెస్టుకు దూరమైన జడ్డూ ఇవాళ జట్టులోకి తిరిగొచ్చిన తెలిసిందే.

Story first published: Thursday, February 15, 2024, 10:50 [IST]
Other articles published on Feb 15, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+