Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: జైస్వాల్ దూకుడు.. షాహిద్ అఫ్రిది, రోహిత్ శర్మ రికార్డులకు ప్రమాదం!

IND vs ENG: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జులై 2 నుంచి బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. టీమిండియా ఈ టెస్ట్ సిరీస్‌లో 0-1తో వెనుకబడి ఉంది. గత తప్పులను మరిచిపోయి రెండో టెస్ట్‌లో తిరిగి పుంజుకోవాలని జట్టు భావిస్తోంది. తొలి టెస్ట్‌లో సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్ ఒక ప్రపంచ రికార్డు సృష్టించే దిశగా ఉన్నాడు. లీడ్స్ టెస్ట్‌లో యశస్వి జైస్వాల్ తొలి ఇన్నింగ్స్‌లో 101 పరుగులు చేశాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 4 పరుగులకే ఔటయ్యాడు. కానీ యశస్వి జైస్వాల్ మంచి ఫామ్‌లో కనిపిస్తున్నాడు. జైస్వాల్ షాహిద్ అఫ్రిది ప్రపంచ రికార్డును బద్దలు కొట్టే దిశగా ఉన్నాడు.

టెస్ట్ క్రికెట్‌లో అత్యంత వేగంగా 50 సిక్సర్లు కొట్టిన బ్యాటర్
ప్రస్తుతం ఈ రికార్డు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది పేరు మీద ఉంది. షాహిద్ అఫ్రిది 46 ఇన్నింగ్స్‌లలో తన టెస్ట్ క్రికెట్‌లో 50 సిక్సర్లు పూర్తి చేశాడు. యశస్వి జైస్వాల్ విషయానికొస్తే.. అతను టెస్ట్ క్రికెట్‌లో 38 ఇన్నింగ్స్‌లలో 40 సిక్సర్లు కొట్టాడు. యశస్వి జైస్వాల్ మరో 10 సిక్సర్లు కొట్టి అఫ్రిది ప్రపంచ రికార్డును తన పేరు మీద నమోదు చేసుకోవచ్చు. ఇంగ్లాండ్ జట్టుపై యశస్వి టెస్ట్ రికార్డు బాగుంది. జైస్వాల్ ఇప్పటివరకు 11 ఇన్నింగ్స్‌లలో 27 సిక్సర్లు కొట్టాడు. ఒకే జట్టుపై అత్యధిక సిక్సర్లు అతను ఇదే జట్టుపై కొట్టాడు. అతను రెండో టెస్ట్‌లో 10 సిక్సర్లు కొట్టలేకపోయినా ఈ రికార్డును బ్రేక్ చేయడానికి అతనికి ఇంకా అవకాశాలు ఉన్నాయి. షాహిద్ అఫ్రిది రికార్డును బ్రేక్ చేయడానికి యశస్వి జైస్వాల్ 7 ఇన్నింగ్స్‌లలో 10 సిక్సర్లు కొట్టాలి.

IND vs ENG Yashasvi Jaiswal eyes Afridi s record may surpass Rohit Sharma in Test sixes

రోహిత్ శర్మను వెనక్కి నెట్టడం ఖాయం
టెస్ట్ క్రికెట్‌లో అత్యంత వేగంగా 50 సిక్సర్లు కొట్టిన రెండో బ్యాటర్ రోహిత్ శర్మ. హిట్ మ్యాన్ ఇటీవల టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. రోహిత్ శర్మ 51 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని చేరుకున్నాడు. రోహిత్ శర్మను యశస్వి జైస్వాల్ ఇప్పటివరకు టెస్ట్‌లో ఆడిన 20 మ్యాచ్‌లలో 38 ఇన్నింగ్స్‌లలో 1903 పరుగులు చేశాడు. యశస్వి జైస్వాల్ 2000 టెస్ట్ పరుగులు పూర్తి చేయడానికి కూడా దగ్గరగా ఉన్నాడు. టెస్టుల్లో యశస్వి జైస్వాల్ ఇప్పటివరకు 5 సెంచరీలు, 10 అర్థ సెంచరీలు సాధించాడు.

ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ గెలవలేదు..
భారత్ ఇంతకు ముందు ఈ మైదానంలో 8 టెస్టులు ఆడింది. వాటిలో 7 ఇంగ్లాండ్ గెలిచింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. టీమిండియా ఈ టెస్టులో గెలిస్తే.. ఇది ఈ మైదానంలో భారత జట్టుకు మొదటి విజయం అవుతుంది.

Story first published: Monday, June 30, 2025, 12:41 [IST]
Other articles published on Jun 30, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+