Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: మూడో రోజు మనదే.. భారత్‌కు భారీ ఆధిక్యం

రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్ జరుగుతున్న మూడో టెస్టుపై భారత్ పట్టుబిగిస్తోంది. మూడో రోజు ఆట ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్‌లో భారత్ రెండు వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌‌పై 322 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (104; 133 బంతుల్లో) సెంచరీ సాధించాడు. తొలుత నిదానంగా ఆడిన జైస్వాల్ తర్వాత టీ20 తరహాలో బ్యాటింగ్ చేశాడు. వెన్నునొప్పి కారణంతో రిటైర్డ్ హట్‌గా వెనుదిరిగాడు. క్రీజులో శుభ్‌మన్ గిల్ (65; 120 బంతుల్లో), కుల్‌దీప్ యాదవ్ (3; 15 బంతుల్లో) ఉన్నారు.

అయితే శనివారం ఆట ప్రారంభానికి ముందే భారత్‌కు షాక్ తగిలింది. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అత్యవసర కారణాలతో మూడో టెస్టుకు దూరమయ్యాడు. కానీ మిగిలిన టీమిండియా బౌలర్లు అద్భుతంగా చెలరేగారు. ఓవర్‌నైట్ స్కోరు 207/2‌తో ఆట‌ను ప్రారంభించిన ఇంగ్లండ్‌‌ను తొలి ఇన్నింగ్స్‌లో 319 పరుగులకు ఆలౌట్ చేశారు. హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లిష్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ఇంగ్లండ్ తమ చివరి ఎనిమిది వికెట్లు 95 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది.

IND vs ENG: Yashasvi Jaiswal century helps India to dominate England in 3rd Test

డకెట్ (153; 151 బంతుల్లో), బెన్ స్టోక్స్ (41; 89 బంతుల్లో) రాణించారు. కాగా, ఇంగ్లండ్ చివరి నాలుగు వికెట్లను 20 పరుగులకే కోల్పోయింది. భారత్ బౌలర్లలో సిరాజ్ నాలుగు వికెట్లు, కుల్‌దీప్, జడేజా చెరో రెండు వికెట్లు, బుమ్రా, అశ్విన్ తలో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 445 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

అనంతరం 126 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఆదిలోనే వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 30 పరుగుల వద్ద రోహిత్ శర్మ (19; 28 బంతుల్లో)ను జో రూట్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన గిల్‌తో కలిసి జైస్వాల్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. రెండో సెషన్ వరకు ఆచితూచి ఆడిన జైస్వాల్ టీ బ్రేక్ అనంతరం చెలరేగాడు. బౌండరీలు, సిక్సర్ల మోత మోగించాడు. ఈ క్రమంలో 78 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన అతడు 122 బంతుల్లో సెంచరీ సాధించాడు. అయితే జైస్వాల్ రిటైర్డ్ హట్‌గా వెనుదిరిగిన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన రజత్ పటిదార్ డకౌటయ్యాడు.

Story first published: Saturday, February 17, 2024, 18:10 [IST]
Other articles published on Feb 17, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+