రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ డబుల్ సెంచరీ సాధించాడు. 231 బంతుల్లో ద్విశతకాన్ని సాధించాడు. శనివారం ఆట చివర్లో 104 పరగుల వద్ద రిటైర్డ్ హట్‌గా వెనుదిరిగిన జైస్వాల్ ఇవాళ తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. టీ20 తరహాలో బ్యాటింగ్ చేస్తూ విరుచుకుపడ్డాడు. వైజాగ్ టెస్టులో కూడా జైస్వాల్ డబుల్ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో జైస్వాల్ పలు రికార్డులు నమోదు చేశాడు. భారత్ తరఫున ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఎడమచేతి వాటం బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో 545 పరుగులు చేసిన జైస్వాల్.. గంగూలీ (534 రన్స్) రికార్డును బ్రేక్ చేశాడు. అంతేగాక భారత్ తరఫున వరుసగా రెండు డబుల్ సెంచరీలు సాధించిన మూడో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అంతకుముందు ఈ ఘనత వినోద్ కాంబ్లీ, విరాట్ కోహ్లీ మాత్రమే ఈ ఘనత సాధించారు. వినోద్ కాంబ్లీ ఇంగ్లండ్‌పై 224, జింబాబ్వేపై 227 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లి శ్రీలంకపై వరుసగా 213, 243 పరుగులు బాదాడు.

12 సిక్సర్లు బాదిన జైస్వాల్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా వసీమ్ అక్రమ్ (పాకిస్థాన్)తో కలిసి చరిత్రకెక్కాడు. 1996లో వసీమ్ అక్రమ్ జింబాబ్వేపై 12 సిక్సర్లు కొట్టాడు. ఇక జైస్వాల్ మరో రికార్డు నెలకొల్పాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ సాధించిన ఆరో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో పటౌడీ, సర్దేశాయ్, సునీల్ గవాస్కర్, వీవీఎస్ లక్ష్మణ్, వసీమ్ జాఫర్ ఉన్నారు. సునీల్ గవాస్కర్ రెండో ఇన్నింగ్స్‌లో రెండు సార్లు ద్విశతకం బాదాడు.
జైస్వాల్ ధాటికి మరికొన్ని రికార్డులు నమోదయ్యాయి. ఓ టెస్టులో ఇండియా సాధించిన అత్యధిక సిక్సర్లు రాజ్‌కోట్ టెస్టులోనే నమోదయ్యాయి. మూడో టెస్టులో మన బ్యాటర్లు 48 సిక్సర్లు బాదారు. గతంలో సౌతాఫ్రికాపై సాధించిన 47 సిక్సర్లు అత్యధికంగా ఉండేవి. అంతేగాక టెస్టుల్లో ఓ ఇన్నింగ్స్‌లో భారత్ సాధించిన అత్యధిక సిక్సర్లు (18) రాజ్‌కోట్ టెస్టులోనే నమోదయ్యాయి.
కాగా, టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను 430/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. యశస్వీ జైస్వాల్ (214; 236 బంతుల్లో), సర్ఫరాజ్ ఖాన్ (68; 72 బంతుల్లో) నాటౌట్‌గా నిలిచారు. శుభ్‌మన్ గిల్ (91; 154 బంతుల్లో), కుల్‌దీప్ యాదవ్ (27; 91 బంతుల్లో) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో రెహాన్ అహ్మద్, జో రూట్, టామ్ హర్ట్‌లీ తలో వికెట తీశారు. ఇంగ్లండ్ విజయానికి 557 పరుగులు చేయాలి. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 445, ఇంగ్లండ్ 319 పరుగులు చేసింది.