అభిషేక్ శర్మపై ఇషాన్ కిషన్ సీరియస్.. స్టంప్ మైక్ ఆడియో వైరల్!
ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా అవతరించిన తర్వాత ఇషాన్ కిషన్ ఆడిన మొదటి ఇన్నింగ్స్‌లోనే ఘోరంగా నిరాశపరిచాడు. ఇంగ్లాండ్‌తో చెస్టర్-లీ-స్ట్రీట్‌లో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో కనీసం ఖాతా తెరవకుండానే ఇషాన్ కిషన్ పెవిలియన్ చేరాడు. నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న సహచర ఓపెనర్ అభిషేక్ శర్మతో రన్ తీసే క్రమంలో చోటుచేసుకున్న అవగాహనా లోపమే ఇషాన్ కిషన్ వికెట్ కోల్పోవడానికి కారణమైంది. అయితే ఈ రనౌట్ వివాదం సమయంలో వీరిద్దరి మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ స్పంప్ మైక్‌లో స్పష్టంగా రికార్డైంది. అందులో ఇషాన్ కిషన్.. "నా కాల్ కదా.. నువ్వెందుకు పరుగెత్తలేదు?" అని అభిషేక్ శర్మను ప్రశ్నించడం వినిపించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఇన్నింగ్స్ రెండో ఓవర్ నాలుగో బంతికే సంజూ శాంసన్ రూపంలో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ షాక్ నుంచి టీమిండియా కోలుకోకముందే.. మరో బంతి వ్యవధిలోనే ఇషాన్ కిషన్ రనౌట్ అయ్యాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్ చివరి బంతిని మిడ్ వికెట్ దిశగా ఆడిన ఇషాన్ కిషన్.. ఓ సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు. అందుకోసం ఆయన చాలా త్వరగా స్పందించి సగం పిచ్ వరకు వచ్చేశాడు. కానీ బంతి వేగంగా ఫీల్డర్ చేతిలోకి వెళ్లడాన్ని గమనించిన అభిషేక్ శర్మ పరుగుకు నిరాకరించి.. ఇషాన్ కిషన్‌ను వెనక్కి వెళ్లాల్సిందిగా గట్టిగా వారించాడు. దాంతో ఇషాన్ కిషన్ తిరిగి క్రీజులోకి చేరుకునే లోపే ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ బంతిని అందుకుని వికెట్లను గిరాటేశాడు.

ఈ రనౌట్‌ను నిర్ధారించడానికి అంపైర్లు థర్డ్ అంపైర్ సహాయాన్ని కోరారు. ఆ సమయంలో పిచ్ మధ్యలో నిలబడిన ఈ ఇద్దరు బ్యాటర్ల మాటలు స్టంప్ మైక్ ద్వారా బయటకు వచ్చాయి. మొదట ఇషాన్ కిషన్ తీవ్ర అసహనంతో.. "నా కాల్ కదా, నువ్వెందుకు పరుగెత్తలేదు?" అని అడిగాడు. దానికి అభిషేక్ శర్మ స్పందిస్తూ.. "ఏం చేస్తున్నావ్ భయ్యా, కనీసం బంతి ఫీల్డర్‌ను దాటనివ్వాలి కదా! సరే ఇప్పుడు చెప్పు.. అవుటా, నాటౌటా? నీకేమనిపిస్తోంది?" అని బదులిచ్చాడు. అందుకు ఇషాన్ చాలా క్లోజ్‌గా ఉందని సమాధానమిచ్చాడు. అనంతరం రీప్లేలో ఇషాన్ కిషన్ క్రీజుకు చాలా దూరంలో ఉన్నట్లు తేలడంతో థర్డ్ అంపైర్ అతడిని ఔట్‌గా ప్రకటించాడు.
ఇషాన్ కిషన్ అంతర్జాతీయ టీ20లలో వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లో రనౌట్ కావడం గమనార్హం. ఇంతకుముందు ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20 లో కూడా తిలక్ వర్మతో జరిగిన ఇలాంటి గందరగోళం వల్లే 12 పరుగుల వద్ద ఇషాన్ కిషన్ రనౌట్ అయ్యాడు. జులై 1న విడుదలైన ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ నుంచి నంబర్-1 స్థానాన్ని లాక్కున్న ఇషాన్ కిషన్ ఇలా డకౌట్ కావడం అభిమానులను నిరాశపరిచింది. మరోవైపు అగ్రస్థానాన్ని కోల్పోయిన అభిషేక్ శర్మ మాత్రం ఈ మ్యాచ్‌లో లీడ్ తీసుకుని 24 బంతుల్లోనే 59 పరుగులతో మెరుపు హాఫ్ సెంచరీ సాధించి సత్తా చాటాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications