టాస్ గెలిస్తే అంతేసంగతులు:
అయితే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి టాస్ ఏమాత్రం కలిసిరావడం లేదు. విదేశాల్లో టెస్ట్ ఫార్మాట్‌లో కోహ్లీ టాస్ గెలిస్తే.. భారత్ తక్కువ పరుగులకే ఆలౌట్ అవుతోంది. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ టాస్ గెలవగా.. భారత్ 36 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత టెస్ట్ మ్యాచ్‌లో వరుసగా 8 సార్లు ఓడిపోయిన తర్వాత కోహ్లీ ఈ మ్యాచులో టాస్ గెలిచాడు. మరోసారి భారత్ తక్కువ పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో నెటిజన్లు కోహ్లీపై సెటైర్లు వేస్తున్నారు. 'కోహ్లీ టాస్ గెలిస్తే అంతేసంగతులు' అని ఒకరు కామెంట్ చేయగా.. 'విదేశాల్లో విరాట్ టాస్ గెలిస్తే ఫలితం ఇలానే ఉంటది మరి' అని ఇంకొకరు కామెంట్ చేశారు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కూడా భారత జట్టుపై వ్యంగంగా ఓ ట్వీట్ చేశాడు. 'గుడ్ ఈవెనింగ్ ఇండియా' అంటూ సెటైర్ వేశాడు.
ఇది మూడో అత్యల్ప స్కోర్:
భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో ఇలా తక్కువ పరుగులకు ఆలౌట్ అవ్వడం ఇది మూడోసారి. ఢిల్లీ వేదికగా 1987లో వెస్టిండీస్ జట్టుపై భారత్ 75 పరుగులు మాత్రమే చేసింది. టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో అదే అత్యల్ప స్కోర్. అహ్మదాబాద్ వేదికగా 2007లో దక్షిణాఫ్రికాపై భారత్ 76 రన్స్ చేయగా.. ప్రస్తుతం లీడ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో 78 పరుగులకు ఆలౌట్ అయింది. మొహాలీలో 1999లో న్యూజీలాండ్ జట్టుపై భారత్ 83 రన్స్ చేసింది. ఇక విరాట్ కెప్టెన్‌గా చేసిన మూడో టెస్టులో భారత్ ఎప్పుడూ ఓడిపోలేదు. కానీ అది ఇప్పుడు బ్రేక్ అయ్యేలా ఉంది.

50 ఇన్నింగ్స్‌లు ముగిసాయి:
ఇక విరాట్ కోహ్లీ సెంచరీ చేయక ఇప్పటికి 50 ఇన్నింగ్స్‌లు ముగిసాయి. లీడ్స్ వేదికగా ఈరోజు ఆరంభం అయిన తొలి ఇన్నింగ్స్ ద్వారా కోహ్లీ శతకం అందుకోక 50 ఇన్నింగ్స్‌లు పూర్తయ్యాయి. మూడు ఫార్మాట్‌లలో కలిపి 50 ఇన్నింగ్స్‌లు ముగిసాయి. 18 టెస్ట్ ఇన్నింగ్స్‌లు, 15 వన్డే ఇన్నింగ్స్‌లు, 17 టీ20 ఇన్నింగ్స్‌లు అందులో ఉన్నాయి. దీంతో కోహ్లీ హాఫ్ సెంచరీ కొట్టాడని అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. 'మూడో టెస్టుతో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ కొట్టాడు' అని ఒకరు కామెంట్ చేయగా.. 'అరరే.. ఎన్నిరోజులాయే. హాఫ్ సెంచరీ చేయక' అని ఇంకొకరు కామెంట్ చేశారు. 'కోహ్లీ 71 సెంచరీ చేయడం అభిమానులకు ఓ కలగా మిగిలిపోనుంది', 'కోహ్లీ ఇక రిటైర్మెంట్ ఇచ్చే సమయం వచ్చేసింది' అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

టెస్టుపై రూట్ సేన పట్టు:
తొలి మ్యాచ్‌లో వర్షం కారణంగా వెనుకబడి, లార్డ్స్‌లో విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచిన టీమిండియా.. అదే జోరులో ఆధిక్యాన్ని పెంచుకోవాలని చూసింది. కానీ లీడ్స్ టెస్టులో భారత్ అనూహ్యంగా కుప్పకూలింది. దీంతో భారత్ దాదాపు రేసులో వెనకపడినట్టే. మరోవైపు లార్డ్స్‌లో ఆట కంటే ఎక్కువ తమ వ్యవహార శైలితోనే వార్తల్లో నిలిచిన ఇంగ్లండ్.. ఆ పరాజయాన్ని పక్కనపెట్టి సిరీస్ సమం చేయాలని కృతనిశ్చయంతో బరిలోకి దిగింది. అందుకు తగ్గట్టే టీమిండియాను తక్కువ పరుగులకు ఆలౌట్ చేసింది. మూడో టెస్టుపై రూట్ సేన ఇప్పటికే పైచేయి సాధించింది. వరణుడు కరుణిస్తే తప్ప.. టీమిండియాను కాపాడేవారే లేరు.


Click it and Unblock the Notifications












