Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అలిగిన ఇషాన్ కిషన్? అసలు కారణం అదేనా?

టీమిండియా యువ వికెట్‌కీపర్ ఇషాన్ కిషన్ పేరు ట్విటర్‌లో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇంగ్లండ్‌‌తో చివరి మూడు టెస్టులకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించనున్న నేపథ్యంలో ఇషాన్ గురించే చర్చలు మొదలయ్యాయి. అతడిని టెస్టు జట్టులోకి ఎంపిక చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు స్పెషలిస్ట్ వికెట్ కీపర్ కేఎస్ భరత్ బ్యాటుతో సత్తాచాటకపోవడంతో ఇషాన్ తిరిగి రావాలని కొందరు కోరుకుంటున్నారు.

అయితే ఇషాన్ కిషన్ ఇంగ్లండ్ సిరీస్‌‌ను ఆడే అవకాశాలు లేవని తెలుస్తోంది. గత రెండు వారాలుగా అతడు ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ ఐపీఎల్‌లోనే రీఎంట్రీ ఇవ్వాలని ఇషాన్ భావిస్తున్నట్లు సమాచారం. పాండ్య బ్రదర్స్ హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్యతో కలిసి ఇషాన్ బరోడాలోని కిరణ్ మోరె అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. 25 ఏళ్ల ఇషాన్ గతేడాది నవంబర్ నుంచి టీమిండియా తరఫున బరిలోకి దిగలేదు.

IND vs ENG: What happened to Ishan Kishan? why he is not respond?

దక్షిణాఫ్రికా పర్యటలనలో ఉన్నప్పుడు మానసిక సమస్యల కారణంతో జట్టుకు దూరమయ్యాడు. తర్వాత కుటుంబం, స్నేహితులతో గడిపాడు. టీవీ షోలో కూడా పాల్గొన్నాడు. అయితే అఫ్గానిస్థాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు ఇషాన్ ఎంపికకాలేదు. దీనిపై టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ వివరణ ఇస్తూ తిరిగి క్రికెట్ ఆడి జట్టులోకి రావాలని సూచించాడు. కానీ రంజీట్రోఫీలో ఇషాన్ పాల్గొనలేదు. దీంతో అతడు క్రికెట్ నుంచి మరింత విరామం తీసుకోవాలని కోరుకుంటున్నాడని భావించారంతా.

కానీ ఇషాన్ తన ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇదంతా దేశవాళీ క్రికెట్‌లో జార్ఖండ్ తరఫున పాల్గొనడానికి కాదని తెలిసింది. రేపటి నుంచి జరగనున్న హర్యానా-జార్ఖండ్ మ్యాచ్‌లో పాల్గొంటున్నట్లు జార్ఖండ్ బోర్డుకు అతడు సమాచారం ఇవ్వలేదు. దీంతో ఇషాన్ ఆలోచనలు ఎవరికీ అంతుచిక్కట్లేదు. మరోవైపు టెస్టుల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే సువర్ణావకాశాన్నికోల్పోతున్నాడు.

IND vs ENG: What happened to Ishan Kishan? why he is not respond?

ఈ నేపథ్యంలో టెస్టులు కంటే ఐపీఎల్‌పైనే ఇషాన్ ఆసక్తి చూపిస్తున్నాడని కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. మెరుగైన ప్రదర్శనలు చేసినా బెంచ్‌కే పరిమితం చేయడంతోనే ఇషాన్ ఈ స్థితికి వచ్చాడని, తిరిగి దేశవాళీ క్రికెట్ ఆడాలని సూచించడంతో అతడు అలిగాడని మరికొందరు నెటిజన్లు అంటున్నారు.

అయితే ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని పొట్టిఫార్మాట్‌ ఆడాలని భావిస్తుండొచ్చని మరికొందరు ఇషాన్‌కు మద్దతు ఇస్తున్నారు. మరోవైపు రాహుల్ ద్రవిడ్ ఇటీవల ఇషాన్ గురించి కీలకవ్యాఖ్యలు చేశాడు. దేశవాళీ క్రికెట్ మాత్రమే ఆడి రావాలని తాను సూచించలేదని, కొంత క్రికెట్ ఆడి తిరిగి రావాలని పేర్కొన్నాని చెప్పాడు. కానీ ఇషాన్ ఏ టోర్నీలో ఆడకుండా భీష్మించుకు కూర్చున్నాడు.

Story first published: Thursday, February 8, 2024, 11:57 [IST]
Other articles published on Feb 8, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+