Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంకా పాఠాలు నేర్పించాలా - ఇంగ్లాండ్ చేతిలో అవమానకర ఓటమికి రోహిత్ శర్మ చెప్పిన కారణం ఇదీ ..!!

IND vs ENG: We didnt turn up with the ball today, says Rohit Sharma after lost the game to England

అడిలైడ్: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌లో భాగంగా భారత క్రికెట్ జట్టు సెమీ ఫైనల్‌లో ఘోరంగా ఓడిపోయింది. ఇంగ్లాండ్ చేతిలో దారుణ పరాజయాన్ని చవి చూసింది. చెత్త బౌలింగ్‌తో చిత్తయింది. టీమిండియా నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్.. ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా కొట్టి అవతల పడేసిందంటే- బౌలింగ్ ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు. జోస్ బట్లర్- 80, అలెక్స్ హేల్స్- 86 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

వికెట్ లెస్..

వికెట్ లెస్..

టీమిండియా బౌలింగ్ గురించి ఎంత తక్కువగా చెప్పుకొంటే అంత మంచిదన్నట్టు తయారైంది. భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, హార్దిక్ పాండ్యా- ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు. ఇంగ్లాండ్ ఓపెనర్ల కౌంటర్ అటాక్‌కు వారి వద్ద సమాధానమే లేకుండా పోయింది. ఒక్కొక్కరు భారీగా పరుగులను సమర్పించుకున్నారు. అక్షర్ పటేల్ మాత్రమే తన నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేసుకోగలిగాడు.

 బౌలింగ్ నాసిరకం..

బౌలింగ్ నాసిరకం..

పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్ సందర్భంగా కేప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు. కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్ తమను చాలా చాలా నిరుత్సాహ పరిచిందని చెప్పాడు. బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్ బాగున్నప్పటికీ.. బౌలింగ్ అంచనాలకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నాడు. ఈ పిచ్‌పై బౌలర్లు రాణించలేకపోవడాన్ని సమర్థించుకోవట్లేదని వ్యాఖ్యానించాడు. 16 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించదగ్గ వికెట్ ఇది ఎంతమాత్రమూ కాదని స్పష్టం చేశాడు.

 ఒత్తిడిని జయించడానికి పాఠాలు చెప్పాలా?

ఒత్తిడిని జయించడానికి పాఠాలు చెప్పాలా?

బంతితో ఏ మాత్రం రాణించలేకపోయామని అంగీకరించాడు రోహిత్ శర్మ. నాకౌట్ దశలోకి వచ్చేసరికి ఒత్తిడిని జయించాల్సిన అవసరం ప్లేయర్లకు ఉంటుందని, ఇక్కడ అది ఫలించలేదని విశ్లేషించాడు. ఒత్తిడిని ఎలా జయించాలనే విషయం మీద ఇంకా పాఠాలను నేర్పించాల్సిన అవసరం లేదనీ గుర్తు చేశాడు. ఐపీఎల్ ప్లేఆఫ్స్ వంటి హైప్రెజర్ గేమ్స్ ఆడిన అనుభవం తమ జట్టు ప్లేయర్లకు ఉందని, దీన్ని హ్యాండిల్ చేయదగ్గ సామర్థ్యం వారికి ఉందనీ అన్నాడు.

ఎగ్జిక్యూట్ చేయలేకపోయాం..

ఎగ్జిక్యూట్ చేయలేకపోయాం..

కొత్త బంతితో ఇన్నింగ్‌ను ఆరంభించిన విధానం కూడా సరిగ్గా లేదని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. కొంత నెర్వస్‌గా ఫీలయ్యారని స్పష్టం చేశాడు. అదే సమయంలో ఇంగ్లాండ్ ఓపెనర్లు అద్భుతంగా ఆడారనీ ప్రశంసించాడు. భువనేశ్వర్ కుమార్ సంధించిన తొలి ఓవర్ స్వింగ్ అయినప్పటికీ- బంతిని సరైన చోట ల్యాండ్ చేయలేకపోయామని అంగీకరించాడు. బ్యాటర్లు ఎలాంటి షాట్లు ఆడకుండా కట్టి పడేసేలా ప్రణాళికలను రూపొందించుకున్నామని, దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేకపోయామని పేర్కొన్నాడు.

తెలిసినా..

తెలిసినా..

స్క్వేర్ లెగ్ దిశగా భారీగా పరుగులను ఇంగ్లాండ్ ఓపెనర్లు రాబట్టుకున్నారని, దాన్ని కట్టడి చేయలేకపోయామని వ్యాఖ్యానించాడు రోహిత్ శర్మ. ఆ విషయాన్ని తాము ముందుగానే పసిగట్టినప్పటికీ- బ్యాటర్ల దూకుడును నిలువరించేలేకపోయినట్లు చెప్పాడు. బంగ్లాదేశ్‌పై జరిగిన మ్యాచ్‌లో తాము ఈ విషయంలో సక్సెస్ అయ్యామని గుర్తు చేశాడు. నెర్వస్‌గా ఫీల్ కావడం కూడా ఓటమికి దారి తీసిందని విశ్లేషించాడు.

Story first published: Thursday, November 10, 2022, 17:27 [IST]
Other articles published on Nov 10, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+