కెప్టెన్‌గా ఆఖరి మ్యాచ్: ధోనీకి గౌరవం, మ్యాచ్‌కు ఫ్రీ ఎంట్రీ
హైదరాబాద్: టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలనందించిన విజయవంతమైన కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోని ఒకడు. ఇటీవలే పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి ధోని వైదొలిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన క్రికెట్ కెరీర్‌లో కెప్టెన్‌గా చివరి మ్యాచ్ ఆడేందుకు బీసీసీఐ ఓ అవకాశాన్ని కల్పించింది.
ఇందులో భాగంగా ముంబైలోని బ్రాబోర్న్ స్టేడియంలో మంగళవారం మధ్యాహ్నం 1. 30 గంటల నుంచి ఇంగ్లాండ్, భారత్ ఏ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌కు చివరిసారిగా ధోని కెప్టెన్‌గా వ్వవహరించనున్నాడు. ఈనెల 15న మొదలయ్యే వన్డే సిరీస్‌కు సన్నాహకంగా భారత్ ఏ, ఇంగ్లాండ్ లెవెన్ జట్లు రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనున్నాయి.
ఈ రెండు మ్యాచ్‌లకూ ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదిక కానుంది. మంగళవారం జరిగే తొలి డే/నైట్ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ, గురువారం జరిగే డే మ్యాచ్‌లో అజింక్యా రహానె భారత ఏ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఇయాన్ మోర్గాన్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టు ఈ వార్మప్ మ్యాచ్ బరిలోకి దిగుతోంది.
పరిమిత ఓవర్ల కెప్టెన్సీ వదులుకున్న తర్వాత ధోని ఆడుతున్న తొలి మ్యాచ్ ఇదే కావడంతో అతనేం చేస్తాడోనని ఆసక్తి నెలకొంది. దీనిలో భాగంగా ఈ మ్యాచ్‌కు హాజరయ్యే అభిమానులకు ఫ్రీ ఎంట్రీ కల్పించనున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. సుమారు పది వేల మంది అభిమానులకు ఉచిత పాస్ లను ఇవ్వనున్నట్లు తెలిపింది.

ధోనీకి గౌరవంతో మ్యాచ్‌కు ఫ్రీ ఎంట్రీ
అయితే మ్యాచ్ ప్రారంభమైన తర్వాత కూడా అభిమానుల్ని ఉచితంగానే స్టేడియంలోకి అనుమతించనున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఫ్రీగా ఆటను చూసేవారికి కేటాయించిన నార్త్, ఈస్ట్ స్టాండ్లు నిండిపోతే మధ్యాహ్నం 3 గంటలకు గేట్లను మూసివేయనున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

ధోనితో పాటు దృష్టంతా యువరాజ్, నెహ్రాలపైనే
తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో దృష్టంతా ధోని ఒక్కడిపైనే కాకుండా భారత జట్టులోకి పునరాగమనం చేసిన యువరాజ్, నెహ్రాలపై కూడా ఉంది. 2011లో ధోని వరల్డ్ కప్ గెలిచిన జట్టులో వీరిద్దరూ సభ్యులుగా ఉన్నారు. మరోవైపు గాయాల నుంచి కోలుకున్న శిఖర్ ధావన్, హార్దిక్ పాండ్యాలకు కూడా ఇది ప్రాక్టీస్ మ్యాచ్.

చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చిన శిఖర్ ధావన్
వన్డే, టీ20 జట్లలో స్థానం సంపాదించిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ పోరుతో మ్యాచ్ ఫిట్‌నెస్‌ను అందుకోవాలనుకుంటున్నాడు. శిఖర్ ధావన్ కూడా చాలా రోజుల తర్వాత భారత వన్డే జట్టులోకి వచ్చాడు. దీంతో ధోనీతోపాటు యువరాజ్ సింద్, ధావన్, నెహ్రాపై అందరి దృష్టి నెలకొంది.

యువీ మళ్లీ ఫామ్‌లోకి రావాలి
దేశవాళీ టోర్నీలలో సత్తా చాటి, ఇంగ్లండ్ తో వన్డే సిరీస్‌కు జట్టులోకి వచ్చిన యువరాజ్, ఈ మ్యాచ్‌లో సత్తా చాటి, తిరిగి ఫామ్‌లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. మన్‌దీప్ సింగ్‌తో కలిసి అతడు ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశముంది. అంబటి రాయుడు, మోహిత్ శర్మ ఈ మ్యాచ్‌తో తిరిగి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాలనుకుంటున్నారు.

వన్డేల్లో పుంజుకోవాలనే యోచనలో ఇంగ్లాండ్
ఇక టెస్టు సిరీస్‌లో ఓటమి పాలైన ఇంగ్లాండ్ వన్డేల్లో పుంజుకోవాలని యోచిస్తోంది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో రాణించి వన్డే సిరీస్ ఆరంభానికి ముందు భారత్‌కు గట్టి హెచ్చరికలు పంపాలని భావిస్తోంది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌తోపాటు, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్, మొయిన్ అలీపై ఆ జట్టు భారీగా అంచనాలు పెట్టుకుంది.

జట్లు వివరాలు
టీమిండియా: శిఖర్ ధావన్, మన్‌దీప్ సింగ్, అంబటి రాయుడు, యువరాజ్ సింగ్, ధోని, హార్దిక్ పాండ్యా, సంజు శాంసన్, కుల్‌దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, నెహ్రా, మోహిత్ శర్మ, సిద్ధార్థ్ కౌల్.
ఇంగ్లాండ్: ఇయాన్ మోర్గాన్, మొయిన్ అలీ, జానీ బెయిర్‌స్టో, జేక్ బాల్, శామ్ బిలింగ్స్, జోస్ బట్లర్, లియామ్ దాడసన్, అలెక్స్ హేల్స్, లియామ్ ప్లంకెట్, అదిల్ రషీద్, జాసన్ రాయ్, బెన్ స్టోక్స్, డేవిడ్ విలే, క్రిస్ వోక్స్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications