IND vs ENG: విరాట్ కోహ్లీకి అంత అహం ఎందుకు.. అశ్విన్‌నే ఆడించడా?! ఈ మ్యాచ్ కూడా పోయినట్టే!!

హైదరాబాద్: ఐదు టెస్ట్ మ్యాచుల సిరీసులో భాగంగా కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు ప్రారంభం అయింది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఇంగ్లీష్ కెప్టెన్ జో రూట్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో భారత్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌కు ఇంగ్లండ్ జట్టు రెండు మార్పులు చేసింది. జోస్ బట్లర్, సామ్ కరన్ స్థానంలో ఒలీ పోప్, క్రిస్ వోక్స్ వచ్చారు. మరోవైపు భారత జట్టులో కూడా రెండు మార్పులు జరిగాయి. సీనియర్ పేసర్లు ఇశాంత్ శర్మ, మొహ్మద్ షమీ స్థానాల్లో శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్‌లు జట్టులోకి వచ్చారు. దాంతో సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది.

అశ్విన్‌కు దక్కని చోటు
నిజానికి నాలుగో టెస్టుకు ముందు రవీంద్ర జడేజా గాయంతో ఆసుపత్రిలో చేరడంతో రవిచంద్రన్ అశ్విన్ ఓవల్ టెస్ట్ ఆడడం ఖాయం అనుకున్నారు. మరోవైపు కెన్సింగ్టన్ ఓవల్ మైదానం మాములుగా పేస్‌తో పాటుగా స్పిన్‌కు సహకరిస్తుంది. మ్యాచ్ సాగేకొద్ది స్పిన్నర్లు పండగ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
దాంతో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. స్పెసలిస్ట్ స్పిన్నర్ అయిన రవిచంద్రన్ అశ్విన్‌కు అవకాశం ఇస్తాడని అందరూ భావించారు. కానీ కోహ్లీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ.. ఫిట్‌నెస్ సాధించిన జడేజానే కొనసాగించాడు. ఇశాంత్ శర్మ స్థానంలో కూడా అశ్విన్‌కు చోటివ్వకుండా.. శార్దూల్ ఠాకూర్‌ను ఎంచుకున్నాడు.
ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది
టాస్ సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ రవిచంద్రన్ అశ్విన్ ఎంపికపై స్పందించాడు. 'ఇంగ్లండ్ జట్టులో నలుగురు లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారు కాబట్టి రవీంద్ర జడేజాను తుది జట్టులోకి తీసుకున్నాం. అతడు వారిని నిలువరించగలడు. జడ్డు ఏడవ స్థానంలో బ్యాటింగ్ కూడా చేయగలడు కాబట్టి జట్టు సమతూకంగా మారుతుంది.
బ్యాటింగ్ బలోపేతం అవుతుంది' అని కోహ్లీ వివరించాడు. అశ్విన్ తుది జట్టులో లేకపోవడంపై కామెంటేటర్లు హర్ష భోగ్లే, సంజయ్ మంజ్రేకర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అశ్విన్ ఎంపిక గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అని మంజ్రేకర్ పేర్కొన్నాడు. యాష్ నెట్స్‌లో తెల్లటి బంతితో బౌలింగ్ చేస్తే ఆశ్చర్యపోతా అని భోగ్లే ట్వీట్ చేశాడు.
కోహ్లీకి అంత అహం ఎందుకు
మరోవైపు నాలుగు టెస్టులో రవిచంద్రన్ అశ్విన్‌కు చోటు ఇవ్వకపోవడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీపై భారత ఫాన్స్ మండిపడుతున్నారు. ఒకవైపు ట్వీట్ల వర్షం కురిపిస్తూ.. మరోవైపు మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. 'ఎప్పటికైనా ఇది చెత్త ఎంపిక. విరాట్ కోహ్లీకి అంత అహం ఎందుకు.. ఆర్ అశ్విన్‌నే ఆడించడా?' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. 'అశ్విన్ లేడుగా.. ఈ మ్యాచ్ కూడా పోయినట్టే' అని ఇంకొకరు ట్వీట్ చేశారు. 'యాష్ వికెట్లు తీయడంలో ఎంత మంచి బౌలరో భారత జట్టు గుర్తించట్లేదు', 'నాలుగో టెస్ట్ కోసం అశ్విన్‌ను ఎందుకు తీసుకోలేదు', 'భారత జట్టులో అశ్విన్ లేడా?', 'యాష్ లేడా.. జట్టు ఎంపికపై ఆశ్చర్యం వేస్తోంది' అని అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అశ్విన్ ఈ సిరీసులో ఒక్క మ్యాచ్ కూడా ఆడని విషయం తెలిసిందే.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, చెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, శార్ధూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
ఇంగ్లండ్: రోరీ బర్న్స్, హసీబ్ హమీద్, డేవిడ్ మలన్, జో రూట్ (కెప్టెన్), ఒలీ పోప్, జానీ బెయిర్‌స్టో, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, క్రేగ్ ఓవర్టన్, ఒలీ రాబిన్‌సన్, జేమ్స్ అండర్సన్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications