Ind vs Eng: భారత్‌కు గోల్డ్ మెడల్ తెచ్చిన విరాట్ కోహ్లీ! అబ్బా.. అది తృటిలో మిస్ అయిందిరా నాయనా!!

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ తన సుదీర్ఘ కెరీర్లోనే ఎన్నడూ లేనంతగా ఇబ్బంది పడుతున్నాడు. ఏడాదికి కనీసం నాలుగైదు సెంచరీలు సాధించే కోహ్లీ.. గత 20 నెలలుగా ఒక్క సెంచరీ కూడా చేయలేదు. టీ20, వన్డేల్లో మోస్తరుగా రాణిస్తున్నా.. టెస్ట్ ఫార్మాట్‌లో మాత్రం అంచనాలను అందుకోలేకపోతున్నాడు. ఇటీవలి కాలంలో హాఫ్ సెంచరీ చేయడమే అతడికి గగనం అయిపొయింది. కోహ్లీ బ్యాటింగ్​ సగటు కూడా రోజురోజుకు పడిపోతుండటం అభిమానులను కలవరపెడుతోంది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టుల్లోనైనా గాడిలో పడతాడనుకుంటే.. అది జరగలేదు.

 IND vs ENG 1st Test:లంచ్ బ్రేక్..రోహిత్ ఔట్!హాఫ్ సెంచరీకి చేరువలో రాహుల్..భారత్ స్కోర్ ఎంతంటే? IND vs ENG 1st Test:లంచ్ బ్రేక్..రోహిత్ ఔట్!హాఫ్ సెంచరీకి చేరువలో రాహుల్..భారత్ స్కోర్ ఎంతంటే?

కోహ్లీ గోల్డెన్ డకౌట్:

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా బుధవారం ఇంగ్లండ్ జట్టుతో ప్రారంభం అయిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గోల్డెన్ డకౌటయ్యాడు. జేమ్స్ అండర్సన్‌ వేసిన 41వ ఓవర్‌లోని మూడో బంతికి కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో భారత్‌ 104 పరుగుల మూడో వికెట్ కోల్పోయింది. కోహ్లీ టెస్టుల్లో గోల్డెన్ డకౌట్ అవ్వడం ఇది 9వ సారి. దీంతో ఇన్నిసార్లు డకౌట్ అయిన భారత కెప్టెన్‌గా ఓ చెత్త రికార్డును తనపై లికించుకున్నాడు. ఎంఎస్ ధోనీ 8, ఎంకే పటౌడీ 7 తర్వాతి స్థానాల్లో ఉన్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వన్డేల్లో 9 సార్లు గోల్డెన్ డకౌట్ అయ్యాడు. టీ20 మూడుసార్లు విరాట్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. రెండు ఫార్మాట్లలో కోహ్లీ పేరుపై చెత్త రికార్డులు ఉన్నాయి.

భారత్‌కు గోల్డ్ మెడల్ తెచ్చాడు:

సరిగ్గా చెప్పాలంటే విరాట్ కోహ్లీ సెంచరీ చేసి 620 రోజులు అయింది. ఈరోజు గోల్డెన్ డకౌట్ అవ్వడంతో అతడి అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా కోహ్లీపై మండిపడుతున్నారు. మరికొందరు అయితే మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఇంకొందరు అయితే జపాన్ వేదికగా జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్ 2020తో కోహ్లీని పోల్చుతున్నారు. 'గోల్డెన్ డకౌట్ అయి.. విరాట్ కోహ్లీ భారత్‌కు గోల్డ్ మెడల్ తెచ్చాడు' అని సెటైర్లు వేస్తునారు. 'అబ్బా.. తృటిలో సెంచరీ మిస్ అయిందిరా నాయనా', 'సెంచరీకి 100 పరుగులే తక్కువ చేశాడు కోహ్లీ' అని కామెంట్లు చేస్తున్నారు.

ఏడాదిన్నర కాలంగా:

ఏడాదిన్నర కాలంగా:

విరాట్ కోహ్లీ గత ఏడాదిన్నర కాలంగా బ్యాటింగ్​లో గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. భారీ స్కోర్లు చేయలేకపోతున్నాడు. 2019 నవంబర్​లో బంగ్లాదేశ్​పై చివరిసారిగా సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కొన్నిసార్లు మాత్రమే 70, అంతకుమించిన పరుగులు చేశాడు. టెస్టులు, వన్డేల్లో కలిపి ఇప్పటికే 70 శతకాలు సాధించిన కోహ్లీ.. ఇటీవల ముగిసిన టెస్ట్​ ఛాంపియన్​షిఫ్​ ఫైనల్​లోనూ పూర్తిగా విఫలమయ్యాడు. ఇంగ్లండ్‌తో ప్రారంభం అయిన టెస్ట్ సిరీస్​లోనైనా 71వ శతకం అందుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. అభిమానుల ఆశలను వమ్ము చేశాడు. 2008లో క్రికెట్​లోకి అడుగుపెట్టిన తర్వాత ప్రతి ఏడాది శతకం సాధిస్తూ వచ్చిన ​కోహ్లీ.. 2020లో మాత్రమే మూడెంకల స్కోరు అందుకోలేకపోయాడు.

2018లో దుమ్మురేపాడు:

2018లో దుమ్మురేపాడు:

2014‌లో తొలిసారి ఇంగ్లండ్ గడ్డపై ఆడిన విరాట్ కోహ్లీ ఆ టూర్‌లో దారుణంగా విఫలమయ్యాడు. 5 టెస్ట్‌ల్లో కేవలం 134 రన్స్ మాత్రమే చేశాడు. జేమ్స్ అండర్సన్ ఔట్‌‌సైడ్ ఆఫ్ స్టంప్ బంతులకు ఎక్కువగా ఔటయ్యాడు. కానీ 2018 పర్యటనలో మాత్రం దుమ్మురేపాడు. గోడకు కొట్టిన బంతిలా దూసుకెళ్లాడు. 5 టెస్ట్‌ల్లో 59.30 సగటుతో 593 రన్స్ చేశాడు. ఇందులో 2 సెంచరీలు కూడా ఉన్నాయి. అయితే కోహ్లీ మాత్రం సెంచరీలు చేయకపోవడంపై ఎలాంటి ఆందోళన చెందటం లేదన్నాడు. 2021 పర్యటనలో ఇంకా నాలుగు టెస్టులు ఉన్న నేపథ్యంలో ఆ కరువు తీర్చుకుంటాడో లేదో చూడాలి.

70 సెంచరీలు.. 22 వేల పరుగులు:

70 సెంచరీలు.. 22 వేల పరుగులు:

2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ (తొలి టెస్ట్ ముందు వరకు) 92 టెస్టులాడి 52.00 సగటుతో 7547 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు (7 డబుల్ సెంచరీలు), 25 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 254 వన్డేల్లో 59.1 సగటుతో 12169 పరుగులు చేసాడు. ఇందులో 43 సెంచరీలు, 62 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 90 టీ20లలో 52.6 సగటుతో 3159 పరుగులు చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు చేసిన కోహ్లీ.. 22 వేల పరుగులు చేశాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, August 5, 2021, 19:30 [IST]
Other articles published on Aug 5, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X