For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కాస్కోండి ఇక.. కోహ్లీ మొదలెట్టేశాడు.. అతడితో కలిసి ప్రాక్టీస్ షురూ

ఒకప్పుడు తన దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరించిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం గత కొంత కాలంగా పరుగులు చేయలేక ఇబ్బంది పడుతోన్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీసుల్లో విఫలమై నిరాశపరిచిన అతడి ఆటతీరు.. పేలవ ఫామ్‌ అని చెప్పలేం... అలాగని మెరుగైన ప్రదర్శన కాదు. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మది కూడా ఇదే తీరు. పరుగులు చేయలేక నిరాశపరుస్తున్నడు. దీంతో ఫామ్ ను అందిపుచ్చుకోవడానికి కోహ్లీ, రోహిత్ రంజీని ఆశ్రయించారు.

ఇప్పటికే రోహిత్(ముంబయి).. జమ్ముకశ్మీర్ తో మ్యాచ్ ఆడేశాడు. కానీ కోహ్లీ(దిల్లీ).. సౌరాష్ట్రపై జరిగిన మ్యాచ్ లో దిగలేదు. నెక్ట్స్ రైల్వేస్ తో జరిగే మ్యాచ్ బరిలో దిగుతున్నాడు. ఇందుకోసం పాత బాటను పట్టాడు విరాట్. ముఖ్యంగా తనలోని పాత కోహ్లీని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. దీని కోసం పాత కోచ్ పర్యవేక్షణలో నెట్స్‌లో చెమటోడ్చుతున్నాడు. బ్యాటింగ్ టెక్నిక్‌ మెరుగుపర్చుకోవడంతో పాటు ఫుట్‌వర్క్ లోపాలు సరిదిద్దుకోవడం, బంతిపై ఫోకస్ పెంచడం వంటి వాటిపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. ముఖ్యంగా ఆఫ్‌సైడ్ బంతిని వెంటాడి ఔటయ్యే బలహీనతతో కోహ్లీ వికెట్‌ను సమర్పించుకుంటున్న సంగతి తెలిసిందే. దీనిపై కూడా పూర్తి దృష్టి సారించాడు.

IND VS ENG Virat Kohli and Sanjay Bangar Reunite for Training Session in Mumbai

ఇంతకీ ఆ కోచ్ ఎవరంటే
విరాట్ తన బ్యాటింగ్ లోపాలను టీమిండియా మాజీ ప్లేయర్, మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ పర్యవేక్షణలో సరిదిద్దుకుంటున్నాడు. అతడితో కలసి నెట్ సెషన్స్‌లో తీవ్రంగా బ్యాటింగ్ సాధన చేస్తున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సంజయ్ బంగర్ బంతులు సంధిస్తుంటే.. విరాట్ కోహ్లీ డిఫెన్స్ చేస్తూ కనిపించాడు.

పైగా నెక్ట్స్ టీమిండియా ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్, ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ ఆడనుంది. వీటిలో కోహ్లీ మంచిగా రాణిస్తేనే ఆ తర్వాత జట్టులో చోటు ఉంటుంది. లేదంటే ప్రశ్నార్థకంగా మారుతుంది. కాబట్టి ఇప్పుడతడు తప్పక ఫామ్ అందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే బంగర్‌ను ప్రత్యేకంగా పిలిపించుకొని మరీ విరాట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇంగ్లాండ్ సీమర్లు జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్ భీకర పేస్‌తో బౌన్సర్లు వేస్తుంటారు. అందుకే కోహ్లీ ప్రాక్టీస్‌ సెషన్ లో ఆ తరహా లాంటి బంతులను ఎదుర్కొంటూ బ్యాటింగ్ ప్రాక్టీస్ తీవ్రంగా చేస్తున్నాడు. గతంలో బంగర్... 2014 నుంచి 2019 వరకు టీమిండియాకు బ్యాటింగ్ కోచ్‌గా పని చేశాడు. 2021 నుంచి 2023 వరకు ఆర్సీబీకి కోచ్‌గానూ సేవలు అందించాడు.

Story first published: Sunday, January 26, 2025, 9:27 [IST]
Other articles published on Jan 26, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+