
7 పరుగులకే ఔట్
జేమ్స్ అండర్సన్ వేసిన మ్యాచ్ తొలి ఓవర్‌లోనే.. కీపర్ జోస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి లోకేష్ రాహుల్ వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ ఐదవ బంతిని అతడు డ్రైవ్ చేయబోయాడు. బ్యాటు అంచుకు తగిలిన బంతి కీపర్ బట్లర్ చేతుల్లో పడింది. అండర్సన్ వేసిన 4.1వ బంతికి చేతేశ్వర్ పుజారా (1; 9 బంతుల్లో) బలయ్యాడు.
అండర్సన్ వేసిన ఇన్నింగ్స్ 10.5 ఓవర్‌కు విరాట్ కోహ్లీ ఔట్ అయ్యాడు. కోహ్లీ కీపర్ బట్లర్‌కి క్యాచ్ ఇచ్చాడు. దీంతో అండర్సన్‌ను ఎదుర్కోవడంలో కోహ్లీ మరోసారి విఫలమయ్యాడు. సరిగ్గా చెప్పాలంటే కోహ్లీ సెంచరీ చేసి దాదాపు 630 రోజులు అయింది. ఈరోజు 7 పరుగులకే ఔట్ అవ్వడంతో అతడి అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
71 సెంచరీ చేయడం కలనే
సోషల్ మీడియా వేదికగా విరాట్ కోహ్లీపై ఫాన్స్ మండిపడుతున్నారు. మరికొందరు ట్వీట్ల వర్షం కురిపిస్తుంటే.. మరికొందరు మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. 'విరాట్ కోహ్లీ 71 సెంచరీ చేయడం అభిమానులకు ఓ కలగా మిగిలిపోనుంది' అని ఓ అభిమాని కామెంట్ చేయగా... 'విరాట్ కోహ్లీ ఇక రిటైర్మెంట్ ఇచ్చే సమయం వచ్చేసింది' అని మరో అభిమాని కామెంట్ చేశాడు. 'జేమ్స్ అండర్సన్ గ్రేట్', 'లే అనుష్క.. ఇంకో ఆటలో చూసుకుందాం', 'జో రూట్ మరియు విరాట్ కోహ్లీ మధ్య ఉన్న వ్యత్యాసం ఇదే' ' అబ్బా.. తృటిలో సెంచరీ మిస్ అయిందిరా నాయనా', 'సెంచరీకి 93 పరుగులే తక్కువ చేశాడు కోహ్లీ' అని ఫాన్స్ సెటైర్లు వేస్తున్నారు.
2019లో చివరి సెంచరీ
విరాట్ కోహ్లీ గత ఏడాదిన్నర కాలంగా బ్యాటింగ్‌లో గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. భారీ స్కోర్లు చేయలేకపోతున్నాడు. 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌పై చివరిసారిగా సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కొన్నిసార్లు మాత్రమే 70, అంతకుమించిన పరుగులు చేశాడు. టెస్టులు, వన్డేల్లో కలిపి ఇప్పటికే 70 శతకాలు సాధించిన కోహ్లీ.. ఇటీవల ముగిసిన టెస్ట్ ఛాంపియన్‌షిఫ్ ఫైనల్లోనూ పూర్తిగా విఫలమయ్యాడు.
ఇంగ్లండ్‌తో ప్రారంభం అయిన టెస్ట్ సిరీస్‌లోనైనా 71వ శతకం అందుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. అభిమానుల ఆశలను వమ్ము చేస్తూనే ఉన్నాడు. 2008లో క్రికెట్‌లోకి అడుగుపెట్టిన తర్వాత ప్రతి ఏడాది శతకం సాధిస్తూ వచ్చిన కోహ్లీ.. 2020లో మాత్రమే మూడెంకల స్కోరు అందుకోలేకపోయాడు.
70 సెంచరీలు.. 23 వేల పరుగులు
2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ (తొలి టెస్ట్ ముందు వరకు) 94 టెస్టులాడి 51.4 సగటుతో 7609 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు (7 డబుల్ సెంచరీలు), 25 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 254 వన్డేల్లో 59.1 సగటుతో 12169 పరుగులు చేసాడు. ఇందులో 43 సెంచరీలు, 62 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 90 టీ20లలో 52.6 సగటుతో 3159 పరుగులు చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు చేసిన కోహ్లీ.. 23 వేల పరుగులు చేశాడు.


Click it and Unblock the Notifications












