Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: మూడో రోజూ మనదే.. విజయం దిశగా భారత్!

ఇంగ్లండ్‌తో వైజాగ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు‌లో టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తోంది. ఓవర్‌‌నైట్ స్కోరు 28/0తో మూడో రోజు ఆటను ఆరంభించిన టీమిండియా 255 పరుగులకు ఆలౌటైంది. శుభ్‌మన్ గిల్ (104; 147 బంతుల్లో) శతకంతో కదంతొక్కాడు. అక్షర్ పటేల్ (45; 84 బంతుల్లో) రాణించాడు. అనంతరం 399 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ మూడో రోజు ఆట ముగిసేసరికి వికెట్ కోల్పోయి 67 పరుగులు చేసింది. క్రీజులో జాక్ క్రాలే (29*; 50 బంతుల్లో), రెహాన్ అహ్మద్ (9*; 8 బంతుల్లో) ఉన్నారు.

‌అయితే ఆదివారం ఆట ప్రారంభమైన కాపేపటికే టీమిండియాకు షాక్ ఎదురైంది. కెప్టెన్ రోహిత్ శర్మ (13; 21 బంతుల్లో), డబుల్ సెంచరీ హీరో యశస్వీ జైస్వాల్ (17; 27 బంతుల్లో)ను ఇంగ్లండ్ పేసర్ అండర్సన్ పెవిలియన్‌కు చేర్చాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయస్ అయ్యర్ (29; 52 బంతుల్లో)‌తో కలిసి గిల్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 81 పరుగులు జోడించి టీమిండియాను పటిష్టస్థితిలో నిలబెట్టారు. కానీ బెన్ స్టోక్స్ అద్భుతమైన క్యాచ్‌కు శ్రేయస్ వెనుదిరగాల్సి వచ్చింది.

IND vs ENG: The third day also for India.. Rohit Co towards victory in Vizag test

అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన రజత్ పటిదార్ (9) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. కానీ అక్షర్ పటేల్ (45; 84 బంతుల్లో)తో కలిసి గిల్ మరోసారి కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయిదో వికెట్ 89 పరుగులు జోడించారు. ఈ క్రమంలో గిల్ శతకాన్ని అందుకున్నాడు. వరుస వైఫల్యాలను అధిగమించి గిల్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. అయితే ఆ తర్వాత ఇంగ్లండ్ బౌలర్లు పుంజుకుని వరుసగా వికెట్లు తీశారు.రవిచంద్రన్ అశ్విన్ (29; 61 బంతుల్లో) ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. భరత్ ఆరు పరుగులతో నిరాశపరిచాడు. కుల్‌దీప్ యాదవ్, బుమ్రా డకౌటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో టామ్ హర్ట్‌లీ నాలుగు వికెట్లు, రెహాన్ అహ్మద్ మూడు, అండర్సన్ రెండు వికెట్లతో సత్తాచాటారు.

అనంతరం ఛేదనకు వచ్చిన ఇంగ్లండ్ ఓపెనర్లు బెన్ డకెట్ (28; 27 బంతుల్లో), క్రాలే దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించారు. బుమ్రా బౌలింగ్‌లో మినహా మిగిలిన బౌలర్లను లక్ష్యంగా చేసుకుని బౌండరీలు సాధించారు. అయితే అశ్విన్ తన తొలి ఓవర్‌లోనే డకెట్‌ను ఔట్ చేసి ఇంగ్లాండ్‌ను దెబ్బతీశాడు. డకెట్ డిఫెండ్‌కు యత్నించగా బంతి గాల్లోకి ఎగిరింది. వికెట్ కీపర్ భరత్ అద్భుతమైన డైవ్‌తో క్యాచ్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ మూడో రోజు ఆటను ముగించింది. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 396 పరుగులు, ఇంగ్లండ్ 253 పరుగులు సాధించింది.

Story first published: Sunday, February 4, 2024, 17:05 [IST]
Other articles published on Feb 4, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+