Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: అందుకే రజత్ పటిదార్‌ను తప్పించాం- రోహిత్ శర్మ

భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో అంతిమ పోరుకు రంగం సిద్ధమైంది. అయిదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ధర్మశాల వేదికగా ఇవాళ నుంచి ఆఖరి టెస్టు జరగనుంది. ఇప్పటికే సిరీస్‌ను టీమిండియా 3-1తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చివరి టెస్టు నామమాత్రమైనప్పటికీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అవకాశాలు మెరుగుపర్చుకోవడానికి ఇరుజట్లకు ఇది కీలకమే కానుంది.

కాగా, టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించేలా కనిపిస్తుండటంతో తొలుత బ్యాటింగ్‌‌కు ఎంచుకున్నామని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ అనంతరం తెలిపాడు. నాలుగో టెస్టుకు విశ్రాంతి తీసుకున్న మార్క్ వుడ్ తిరిగి జట్టులోకి వచ్చాడని పేర్కొన్నాడు.

IND vs ENG That s why we dropped Rajat Patidar- Rohit Sharma

మరోవైపు ఆఖరి టెస్టులో టీమిండియాలో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. రజత్ పటిదార్ స్థానంలో దేవదత్ పడిక్కల్ జట్టులోకి వచ్చాడు. దేవదత్ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేస్తున్నాడు. బుమ్రా తిరిగిరావడంతో ఆకాశ్ దీప్ జట్టులో స్థానం కొల్పోయాడు. జట్టు మార్పు గురించి రోహిత్ శర్మ మాట్లాడాడు.

''టాస్ గెలిస్తే మేం కూడా బ్యాటింగ్ చేసేవాళ్లం. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందనిపిస్తుంది. ఈ సిరీస్‌లో మేం మెరుగైన ప్రదర్శన చేశాం. గొప్పగా ముగించే అవకాశం వచ్చింది . రవిచంద్రన్ అశ్విన్ భారత్ క్రికెట్‌కు నిజమైన ధీరుడు. అతను దేశానికి గర్వకారణం. బుమ్రా తిరిగిరావడంతో ఆకాశ్ దీప్‌ జట్టులో చోటు కోల్పోయాడు. రజత్ పటిదార్‌కు నిన్న సాయంత్రం గాయమైంది. దేవదత్ పడికల్ అరంగేట్రం చేస్తున్నాడు'' అని రోహిత్ పేర్కొన్నాడు.

టీమిండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, దేవదత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్‌దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

ఇంగ్లండ్
జాక్‌ క్రాలీ, బెన్ డకెట్, ఓలి పోప్, జోరూట్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్, టామ్ హార్ట్‌లీ, మార్క్‌వుడ్, జేమ్స్ అండర్సన్, షోయబ్ బషీర్

Story first published: Thursday, March 7, 2024, 9:34 [IST]
Other articles published on Mar 7, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+