Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG Test: ఎవరికి అవకాశం లభిస్తుంది?.. టీమిండియా ప్లేయింగ్-XI ఇదే..!

IND vs ENG Test: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జూన్ 20 నుంచి లీడ్స్‌లోని హెడింగ్లీలో ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు సంబంధించి టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌పై ఇప్పటికే చర్చలు ముమ్మరమయ్యాయి. ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టును గత నెలలో ప్రకటించారు. శుభ్‌మన్ గిల్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో అనేక కీలక సూచనలు ఇవ్వడం ద్వారా ప్లేయింగ్-11పై చిత్రాన్ని చాలా వరకు క్లియర్ చేశారు.

కరుణ్ నాయర్‌కు గంభీర్ సపోర్ట్
ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కరుణ్ నాయర్ గురించి కీలక ప్రకటన చేశాడు. తన ప్రకటనలో కరుణ్ నాయర్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించి అతని ఇటీవలి ఫామ్‌ను ప్రశంసించాడు. ఒక ఆటగాడు నిలకడగా పరుగులు చేసినప్పుడు అతడి ప్రదర్శన ఆధారంగా అతడికి అవకాశాలు రావాలని గంభీర్ పేర్కొన్నాడు. గంభీర్ ప్రకటనను బట్టి 8 ఏళ్ల తర్వాత టెస్ట్ జట్టులోకి తిరిగి వచ్చిన కరుణ్ నాయర్‌కు ఇంగ్లాండ్‌తో జరిగే తొలి టెస్ట్‌లో అవకాశం లభించడం ఖాయమని తెలుస్తోంది.

IND vs ENG Test 2025 Predicted India Playing XI and Karun Nair s Comeback Confirmed

ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనకు ముందు ఇండియా-ఏ తరఫున ఆడుతున్నప్పుడు కరుణ్ నాయర్ ఇంగ్లాండ్ లయన్స్ జట్టుపై డబుల్ సెంచరీ సాధించాడు. 2024-25 రంజీ ట్రోఫీలో 863 పరుగులు చేయడం ద్వారా తన అద్భుతమైన ఫామ్‌ను సెలెక్టర్లకు పరిచయం చేశాడు. కరుణ్ నాయర్ అద్భుతమైన ప్రదర్శనను ప్రశంసిస్తూ కరుణ్ నాయర్ వంటి ఆటగాడి అనుభవం ఇంగ్లాండ్ క్లిష్ట పరిస్థితుల్లో జట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని గంభీర్ అన్నాడు. 2016లో ఇంగ్లాండ్ లాంటి బలమైన జట్టుపై ట్రిపుల్ సెంచరీ సాధించడం ద్వారా కరుణ్ నాయర్ అందరి దృష్టిని ఆకర్షించాడు. కానీ ఆ తర్వాత కొంతకాలంలోనే కరుణ్ నాయర్ జట్టుకు దూరమయ్యాడనే విషయం తెలిసిందే. దీని తర్వాత కూడా కౌంటీ క్రికెట్, దేశీయ క్రికెట్‌లో నిలకడగా మంచి ప్రదర్శన ఇవ్వడం ద్వారా కరుణ్ నాయర్ భారత జట్టులో తన స్థానాన్ని తిరిగి పొందాడు.

ప్లేయింగ్-11పై మౌనం వహించిన శుభ్‌మన్ గిల్
ఇంగ్లాండ్ పర్యటనకు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో టీమిండియా కొత్త టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్లేయింగ్-11 ప్రశ్నపై సస్పెన్స్ కొనసాగించాడు. ఇంగ్లాంగ్ చేరుకున్న తర్వాతే తుది ప్లేయింగ్-11ను ఎంపిక చేస్తామని మీడియాతో జరిగిన సంభాషణలో ఆయన స్పష్టం చేశారు. అయితే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ , ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మాటల నుంచి జట్టులో కొంత మంది కీలక ఆటగాళ్ల స్థానం దాదాపు ఖరారైనట్లు స్పష్టం అవుతోంది. ఈ సిరీస్ ద్వారా శుభ్‌మన్ గిల్ టెస్ట్ కెప్టెన్సీలో అరంగేట్రం చేస్తున్నాడు. గిల్ కెప్టెన్సీలో జట్టు ఎలా రాణిస్తుందో చూడాల్సిందే.

టీమిండియా ప్లేయింగ్-11(అంచనా)
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), కరుణ్ నాయర్, రిషబ్ పంత్(వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

Story first published: Friday, June 6, 2025, 18:50 [IST]
Other articles published on Jun 6, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+