టాస్ గెలవడం వద్దే వద్దు రోహిత్ శర్మ..!!

అడిలైడ్: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌లో భాగంగా భారత క్రికెట్ జట్టు ఇంకాసేపట్లో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడబోతోంది. ఇంగ్లాండ్‌తో తలపడటానికి సమాయాత్తమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి- ఫైనల్‌లో అడుగు పెట్టడానికి ఉవ్విళ్లూరుతోంది రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా. దీనికోసం కఠోరంగా శ్రమించింది. 2007 తరువాత మళ్లీ టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకోవడానికి రెండే రెండు అడుగుల దూరంలో నిలిచింది.

ట్విస్టుల మీద ట్విస్టులు..
భారత్-ఇంగ్లాండ్ మధ్య అడిలైడ్ ఓవల్‌లో జరగబోతోన్న ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం ఫైనల్స్ ఆడుతుంది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్‌లో పాకిస్తాన్‌తో తలపడుతుంది. అనూహ్య పరిస్థితులు, అనేక ట్విస్టుల తరువాత పాకిస్తాన్.. ఫైనల్‌లో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. సూపర్ 12 దశలో నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా దారుణంగా ఓడిపోవడం పాకిస్తాన్‌కు ప్లస్ పాయింట్. అదే సమయంలో బంగ్లాదేశ్‌ను మట్టి కరిపించింది.

అనుకోని ప్రస్థానం..
సెమీ ఫైనల్స్‌లో అడుగు పెట్టింది. ఇక్కడ న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది పాకిస్తాన్. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ను 152 పరుగుల వద్దే కట్టడి చేసి పడేశారు బౌలర్లు. అనంతరం బ్యాటింగ్‌లో సునామీలా విరుచుకుపడ్డారు. ఇంకా అయిదు బంతులు మిగిలివుండగానే మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి 153 పరుగులు చేసింది. ఫైనల్స్‌లో అడుగు పెట్టింది. భారత్- ఇంగ్లాండ్ మధ్య జరిగే మ్యాచ్ విన్నర్‌ను ఎదుర్కొంటుంది పాకిస్తాన్.

అడిలైడ్ స్టేడియం చెత్త రికార్డ్..
కాగా భారత్-ఇంగ్లాండ్ మధ్య రెండో సెమీ ఫైనల్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోన్న అడిలైడ్ ఓవల్ స్టేడియానికి ఓ చెత్త రికార్డ్ ఉంది. ఇక్కడ టాస్ గెలిచిన జట్టు మ్యాచ్‌లో కూడా విజేతగా నిలిచిన సందర్భం లేనే లేదు. టాస్ గెలిచిన ప్రతి జట్టూ తాను ఆడిన టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ను ప్రత్యర్థికి ధారపోసుకుంది. ఈ స్టేడియంలో ఇప్పటివరకు మొత్తంగా 11 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు ఏడుసార్లు నెగ్గగా.. ఛేజింగ్ టీమ్ విన్ అయిన మ్యాచ్‌లు నాలుగే.

ఈ పిచ్‌పై హయ్యెస్ట్ స్కోర్ ఇదే..
ఆ మ్యాచ్‌లల్లో టాస్ గెలిచిన జట్టు ఒక్క మ్యాచ్‌లోనూ విజయాన్ని సొంతం చేసుకోలేదు. అడిలైడ్ పిచ్‌పై సెంచరీ బాదిన హీరో- డేవిడ్ వార్నర్. 2019లో శ్రీలంకపై అతను ఈ ఘనతను సాధించాడు. బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ షేన్ వాట్సన్ పేరు మీద ఉన్నాయి. 2011లో ఇంగ్లాండ్‌పై 15 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. అత్యధిక పరుగులు చేసిన జట్టు కూడా ఆస్ట్రేలియానే. 2019లో లంక జట్టును ఉతికారబెట్టారు ఆస్ట్రేలియా బ్యాటర్లు. 233 చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications