Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మూడో టీ20కు ముందు.. అక్షర్ పటేల్ కొత్త అవతారం (వీడియో వైరల్)

ఇంగ్లాండ్‌తో జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా థ్ల్రిల్లింగ్ విక్ట‌రీ సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఐదు మ్యాచుల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది భారత జట్టు. మూడో మ్యాచ్ గుజ‌రాత్‌లోని రాజ్‌కోట్‌ వేదికగా జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ కొత్త అవతారం ఎత్తాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది క్రికెట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

మూడో టీ20 మ్యాచ్ కు ముందు అక్షర్ పటేల్ వ్లాగర్ గా మారాడు. దీనినే బీసీసీఐ షేర్ చేసింది. ఈ వీడియోలో భారత ప్లేయర్లు చెన్నై ఎయిర్ పోర్ట్ నుంచి మూడో మ్యాచ్ వేదికైన రాజ్ కోట్ హోటల్ వరకు చేసిన జర్నీని చూపించారు. ఇంకా ఇందులో అక్షర్ పటేల్ తన టీమ్ మేట్స్, కోచింగ్ స్టాఫ్ తో సంభాషించడం, టీమ్ బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కిల్, ఆల్ రౌండర్స్ రమన్ దీప్ సింగ్, హార్దిక్ పాండ్య, లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తో మాట్లాడటం వంటివి కనిపించింది.

IND VS ENG T20 Series Axar Patel Seen In New Role Vlogger Ahead Of 3rd T20I Against England In Rajkot

అలాగే రైట్ ఆర్మ్ సీమర్ హర్షిత్ రానాతో పాటు అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, ధ్రువ్ జురెల్ వంటి ప్లేయర్స్ తోనూ అక్షర్ ఇంటరాక్ట్ అవుతుండటం చూపించారు. చివరిగా వీడియోలో.. రాజ్ కోట్ హోటల్ దగ్గర టీమిండియా జట్టుకు దక్కిన ఘన స్వాగతానికి సంబంధించిన దృశ్యాలను చూపించారు. ప్లేయ‌ర్లంతా నడుస్తుండగా హోటల్ నిర్వాహకులు.. వారికి పూలమాలలు వేసి సత్కరించారు. ఈ సంద‌ర్భంగా స్టార్ బౌల‌ర్‌ అర్ష్‌దీప్ సింగ్ డ్యాన్స్ చేస్తూ కూడా కనిపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. కాగా, ఈ మూడో టీ20 మ్యాచ్ జనవరి 28న జరగనుంది.

మూడో టీ20కి భారత తుది జట్టు(అంచనా):
సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్(కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, ధ్రువ్ జురెల్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్.

Story first published: Monday, January 27, 2025, 15:09 [IST]
Other articles published on Jan 27, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+