Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: పిచ్‌ను ఊడ్చడానికే భారత్‌కు వెళ్లారా? (Video)

రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ ఆధిపత్యం చెలాయిస్తుంది. కీలక సమయాల్లో వికెట్లు సాధిస్తూ ప్రత్యర్థి జట్టును భారత బౌలర్లు ఒత్తిడిలోకి నెడుతున్నారు. సమష్టిగా రాణిస్తూ 245 పరుగులకే ఇంగ్లండ్ ఏడు వికెట్లు పడగొట్టారు. అరంగేట్ర బౌలర్ ఆకాశ్ దీప్ మూడు వికెట్లతో చెలరేగాడు. మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా చెరో వికెట్ పడగొట్టారు.

అయితే ఇంగ్లండ్ బ్యాటర్ల ప్రదర్శన పట్ల ఆ జట్టు మాజీ క్రికెటర్ నిక్ నైట్ విమర్శలు చేశాడు. జానీ బెయిర్‌స్టో‌ చెత్త షాట్ ఆడి వికెట్‌ను చేజార్చుకున్నాడని పేర్కొన్నాడు. దూకుడుగా ఆడే క్రమంలో అనవసర ఊడ్చే (స్వీపింగ్) షాట్లు ఆడాడని విమర్శించాడు. 35 బంతుల్లో 38 పరుగులు చేసిన బెయిర్‌స్టో.. అశ్విన్ బౌలింగ్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. స్వీప్ షాట్‌కు యత్నించి బెయిర్‌స్టో వికెట్ల ముందు దొరికిపోయాడు.

IND vs ENG: sweep shot wasnt the right option at the right time - Former England opener Nick Knight

''ఇలాంటి పిచ్‌పై స్వీప్ షాట్లు ఆలోచించి ఆడాలని గతంలో ఎన్నోసార్లు సూచించాం. ఇది నిజంగా చెత్త షాట్. బజ్‌బాల్ గురించి చాలా మాట్లాడుకున్నాం. అలాగే దూకుడుగా ఆడే క్రమాన్ని కూడా వివరించుకున్నాం. పరిస్థితులకు తగ్గట్లుగా బ్యాటింగ్ చేయాలి కదా? ఆటను ఏం అర్థంచేసుకున్నట్లు? మీ ఫీట్‌ను ఉపయోగించుకుని ఎలాంటి షాట్లు ఆడుతున్నారు?''

''అశ్విన్ వేసిన బంతి గురించి ఫలితాన్ని ముందే ఊహించాను. అయితే దూకుడుగా ఆడకూడదని చెప్పట్లేదు. సందర్భాన్ని బట్టి అగ్రిసివ్ బ్యాటింగ్ చేయాలి. ఆ స్థితిలో స్వీప్ షాట్ అనేది చాలా దారుణమైన ఎంపిక'' అని నిక్ నైట్ పేర్కొన్నాడు. బెయిర్‌స్టో ఔటైన సమయానికి ఇంగ్లండ్ 112 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ సెకండ్ సెషన్‌లో జో రూట్‌ (88*)తో కలిసి బెన్ ఫోక్స్ (47) జాగ్రత్తగా ఆడుతూ స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 113 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం క్రీజులో జో రూట్, రాబిన్సన్ (8*) ఉన్నారు.

Story first published: Friday, February 23, 2024, 16:04 [IST]
Other articles published on Feb 23, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+