Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: ఇంగ్లాండ్‌కు పంజాబ్ బౌలర్లు.. గిల్ నిర్ణయం వెనుక ఆసక్తికర కారణం!

IND vs ENG: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ బర్మింగ్‌హామ్ నగరంలో వచ్చే బుధవారం(జులై 2) నుంచి ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ కోసం భారత ఆటగాళ్లు బర్మింగ్‌హామ్‌లో బస చేసి ప్రాక్టీస్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. శుభ్‌‌మన్ గిల్ స్వస్థలం పంజాబ్ రాష్ట్రం. ఈ పరిస్థితుల్లో శుభ్‌మన్ గిల్ పంజాబ్ రాష్ట్రంలో అద్భుతంగా బౌలింగ్ చేయగల ఇద్దరు ఆటగాళ్లను ఎంపిక చేసి, వారిని ప్రాక్టీస్ కోసం ఇంగ్లాండ్‌కు పిలిచారు. దీని కోసం గిల్ తన కెప్టెన్సీ పవర్‌ను వినియోగించారు.

అందులో ఒకరు ఎడమచేతి వాటం స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రార్. రెండో టెస్ట్ కోసం ఇంగ్లాండ్‌లో ఉన్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్, అతడిని ప్రాక్టీస్‌కు ఆహ్వానించారు. అదేవిధంగా చండీగఢ్‌కు చెందిన జగ్జీత్ సింగ్ సంధు అనే పేసర్‌ను కూడా గిల్ ఇంగ్లాండ్‌కు పిలిపించారు. జట్టులో ఉన్న అదనపు ఆటగాళ్లును భారత్‌కు పంపిన తర్వాత శుభ్‌మన్ గిల్ ఇద్దరు ఆటగాళ్లను ఇంగ్లాండ్‌కు రప్పించడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ ఇద్దరు ఆటగాళ్లును ప్రాక్టీస్ కోసమే పిలిపించారని.. భారత ప్రధాన జట్టులో వారికి చోటు దక్కే అవకాశం లేదని వార్తలు వెలువడ్డాయి.

IND vs ENG Shubman Gill s Strategic Decision to Bring Punjab Bowlers for Practice in England

ప్రాక్టీస్‌లో ఎక్కువ బంతులు ఎదుర్కోవడానికి శుభ్‌మన్ గిల్ తన అధికారాన్ని ఉపయోగించి.. బీసీసీఐకి చెప్పి ఈ ఇద్దరు ఆటగాళ్లను ఇంగ్లాండ్‌కు రప్పించారు. దీనిపై హర్‌ప్రీత్ బ్రార్ మాట్లాడుతూ.. "నా భార్య స్విన్టన్ అనే నగరంలో ఉంది. బర్మింగ్‌హామ్ నుంచి ఒక గంట ప్రయాణం చేస్తే ఆ పట్టణానికి చేరుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో గిల్ నాతో ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు భారత జట్టు ప్రాక్టీస్‌లో పాల్గొనమని ఆహ్వానించాడు. అందుకే వచ్చాను." అని హర్‌ప్రీత్ బ్రార్ చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, June 30, 2025, 10:40 [IST]
Other articles published on Jun 30, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+