For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: శుభ్‌మన్ గిల్ - జాక్ క్రాలీ వివాదం.. రెచ్చిపోయిన ఇంగ్లాండ్ కోచ్

IND vs ENG: లార్డ్స్‌లో జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆట ఇరు జట్ల మధ్య పెద్ద వాగ్వాదంతో ముగిసింది. మూడో రోజు ఆట ఆఖరి ఓవర్‌లో హైడ్రామా చోటు చేసుకుంది. ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్దం మొదలైంది. ఇంగ్లండ్ ఓపెనర్లు అతి తెలివిని ప్రదర్శించడంతో టీమిండియా ఆటగాళ్లు ధీటుగా బదులిచ్చారు. విరాట్ కోహ్లీ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తగ్గేదేలే అంటూ ప్రత్యర్థి ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగాడు.

ఈ వాగ్వాదానికి సంబంధించి ఇంగ్లాండ్ జట్టు బౌలింగ్ కోచ్ టిమ్ సాథీ తీవ్రంగా స్పందించాడు. దీనికి సంబంధించి భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మైదానంలో మసాజ్ చేయించుకున్నాడు. మా ఆటగాళ్లకు గాయమైతే ప్రథమ చికిత్స చేయించుకోవడం తప్పా? అని టిమ్ సౌథీ ప్రశ్నించాడు. మూడో రోజు ముగింపులో, ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్ క్రాలీ సమయాన్ని వృథా చేస్తున్నాడని భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కోపగించుకున్నాడు. గిల్ ఈ చర్యను టిమ్ సౌథీ ద్వంద్వ వైఖరిగా తీవ్రంగా విమర్శించాడు.

IND vs ENG Shubman Gill - Jack Crawley Controversy and Heated Response from England s Coach

మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు 387 పరుగులను భారత్ కూడా సమం చేసింది. ఆట ముగియడానికి కొన్ని నిమిషాల ముందు ఇంగ్లాండ్ తన రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. జస్ప్రీత్ బుమ్రా వేసిన ఓవర్లో ఓపెనర్ జాక్ క్రాలీ బంతి వేయడానికి ముందు రెండు సార్లు కదిలి నిలబడ్డాడు. ఇది భారత ఆటగాళ్లలో కాపాన్ని తెప్పించింది. చివరి నిమిషంలో ఎక్కువ ఓవర్లు ఎదుర్కొని వికెట్ కోల్పోకుండా ఉండటానికి ఇంగ్లాడ్ జట్టు ఇలా ప్లాన్ చేసిందని వివాదం చెలరేగింది.

ముఖ్యంగా భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. క్రాలీని ఉద్దేశించి కొన్ని అనుచిత పదాలు ఉపయోగించాడు. అంతే కాకుండా అదే ఓవర్లో బంతి చేతికి తగలడంతో క్రాలీ వైద్య సహాయం కోరినప్పుడు భారత ఆటగాళ్లు అపహాస్యంగా చప్పట్లు కొట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు. దీంతో మైదానంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ఈ ఘటనపై మాట్లాడిన ఇంగ్లాండ్ జట్టు బౌలింగ్ కోచ్ టిమ్ సౌథీ మాట్లాడుతూ.. "నిన్నటి ఆటలో శుభ్‌మన్ గిల్ వెన్నునొప్పి కోసం మైదానంలో మసాజ్ చేయించుకున్నాడు. అప్పుడు మేము సమయం వృథా చేస్తున్నాడని ఫిర్యాదు చేయలేదు. కాబట్టి, ఇప్పుడు వారు ఎందుకు ఫిర్యాదు చేస్తున్నారో తెలియదు. ఆట చివరిలో ఇలాంటి సంఘటనలు ఒక రకమైన ఉత్సాహాన్ని ఇస్తాయి" అని అన్నారు.

ఈ ఘర్షణపై భారత ఆటగాడు కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. "రోజు చివరిలో ఇలా జరగడం ఆటలో ఒక భాగం. ఓపెనర్‌గా క్రాలీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. ఆరు నిమిషాలు మిగిలి ఉన్నప్పుడు, రెండు ఓవర్లు వేయాలని మేము కోరుకున్నాం. ఒక వికెట్ తీసుంటే అది మాకు అనుకూలంగా ఉండేది" అని అన్నారు. ఇరు జట్లు తొలి ఇన్నింగ్స్‌లో సమాన స్కోరు సాధించడంతో, ఈ ఘర్షణ మ్యాచ్‌కు మరింత వేడిని పెంచింది. నాలుగవ రోజు ఆట అభిమానులలో తీవ్ర ఉత్కంఠను రేకెత్తించింది.

Story first published: Sunday, July 13, 2025, 9:55 [IST]
Other articles published on Jul 13, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+