Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లండ్‌కు ఏడుపే తక్కువ..స్లెడ్జింగ్‌లో రెచ్చిపోయిన సర్ఫరాజ్ (Video)

ధర్మశాల టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయిదు టెస్టుల సిరీస్‌ను 4-1తో భారత్ కైవసం చేసుకుంది. అయితే మరో మ్యాచ్ మిగిలుండగానే రోహిత్‌సేన సిరీస్‌ను సొంతం చేసుకుంది. దీంతో నామమాత్రపు ధర్మశాల టెస్టులో మజా ఉండదేమోనని అభిమానులు భావించారు.

కానీ ఆటతో పాటు మాటల యుద్ధంతో ధర్మశాల వేడెక్కింది. స్లెడ్జింగ్‌లో శుభ్‌మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్ రెచ్చిపోయారు. కవ్వించడంలో ఎప్పుడూ ముందుండే ఇంగ్లిష్ ఆటగాళ్లకు మనోళ్లు చుక్కలు చూపించారు. అయితే మూడో రోజు ఆట తొలి సెషన్ ముగిసిన అనంతరమే టీమిండియా విజయం దాదాపు ఖరారైంది. కానీ పరువు కోసం ఆఖరి సెషన్ వరకు అయినా మ్యాచ్‌ను కొనసాగించాలని ఇంగ్లండ్ పట్టుదలతో పోరాడింది.

IND vs ENG Shoaib Bashir was sledged by Sarfaraz Khan

రెండో సెషన్‌లో తొమ్మిదో వికెట్ కోసం భారత బౌలర్లు శ్రమించాల్సి వచ్చింది. షోయబ్ బషీర్‌, జో రూట్ మన బౌలర్లను పరీక్షించారు. దీంతో బ్యాటర్లకు దగ్గరగా షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సర్ఫరాజ్ ఖాన్ రంగంలోకి దిగాడు. తన మాటలతో షోయబ్ బషీర్‌ను విసిగించాడు. 'తొందరగా ఆడు, మ్యాచ్‌ను ముగించు. మేం మంచులో నడవడానికి వెళ్లాలి' అని కవ్విస్తూ బషీర్ ఏకాగ్రతను సర్ఫరాజ్ దెబ్బతీశాడు. గౌరవప్రదమైన స్కోరు అయినా సాధించి కాస్త పరువు కాపాడుకుందామనుకున్న ఇంగ్లండ్ సర్ఫరాజ్ దెబ్బకి విసిగిపోయి రెండోసెషన్‌లోనే ఆలౌటైంది.

దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కోహ్లి లేని లోటును సర్ఫరాజ్ భర్తీ చేస్తున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రత్యర్థి ఆటగాళ్లు విరాట్ కోహ్లి ఏ రీతిలో కవ్విస్తాడో క్రికెట్ అభిమానులకు తెలిసిందే. కాగా, అంతకుముందు జానీ బెయిర్‌స్టోను శుభ్‌మన్‌ గిల్‌, ధ్రువ్‌ జూరెల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌ ఓ ఆట ఆడుకున్నారు. తొలుత గిల్‌తో బెయిర్‌స్టో వాగ్వాదానికి దిగాడు. 'రిటైర్మెంట్‌ గురించి అండర్సన్‌తో ఏమన్నావు? ఆ తర్వాతే అండర్సన్ నిన్ను ఔట్‌ చేశాడు' అని బెయిర్‌స్టో స్టార్ట్ చేశాడు.

దీనికి మన కుర్రాళ్లు దీటుగా బదులిచ్చారు. 'అతను రిటైర్ అవ్వాలని అన్నాను. అయితే ఏంటి? సెంచరీ చేసిన తర్వాత నేను ఔటయ్యా. నువ్వు ఎన్ని శతకాలు బాదావు?' అని గిల్ అన్నాడు. 'ఇక ఆపేయ్' అంటూ బెయిర్‌స్టో ముగించడానికి ట్రై చేశాడు. కానీ మరోవైపు ధ్రువ్ జురెల్ 'జానీ బాయ్ ప్రశాంతంగా ఉండూ' అని అన్నాడు. ఆ తర్వాత సర్ఫరాజ్.. 'అతన్ని సైలెంట్‌గా ఉండమను. ఇవాళ ఏవో కొన్ని పరుగుులు చేసి ఎగిరెగిరి పడుతున్నాడు' అని రెచ్చగొట్టాడు. కాసేపటికే బెయిర్‌స్టో తన వికెట్‌ను చేజార్చుకోవడం గమనార్హం.

Story first published: Sunday, March 10, 2024, 12:52 [IST]
Other articles published on Mar 10, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+