షమీని ఊరిస్తోన్న వరల్డ్ రికార్డ్!.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు!!
టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ అరుదైన ప్రపంచ రికార్డు ముంగిట నిలిచాడు.ఇంగ్లాండ్‌తో ఈ నెల 22న ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం సెలక్టర్లు షమిని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇంతకీ అతడిని ఊరిస్తోన్న రికార్డు ఏంటంటే?
టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమి పునరాగమనం కోసం, సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తోన్న అభిమానుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. దాదాపు 14 నెలల తర్వాత మళ్లీ జట్టులోకి రాబోతున్నాడు. ఇంగ్లాండ్‌తో ఈ నెల 22న ఆరంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం సెలక్టర్లు షమిని ఎంపిక చేశారు.అయితే ఇంగ్లాండ్ తో జరగబోయే వన్డే సిరీస్ లోనూ షమీ చోటు దక్కించుకోవడం దాదాపుగా ఖాయమన్న ప్రచారం సాగుతోంది.

ఈ నేపథ్యంలోనే షమీని ఓ ప్రపంచ రికార్డు ఊరిస్తోంది. అతడు గత వన్డే ప్రపంచకప్-2023లో అద్భుత ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై జరిగిన ఈ మెగా టోర్నీలో ఏకంగా 24 వికెట్లు పడగొట్టి, లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఒకవేళ ఇప్పుడు అతడు ఇంగ్లాండ్ తో జరగబోయే వన్డే సిరీస్ కు ఎంపికైతే, తొలి వన్డేలో ఐదు వికెట్లు తీస్తే చాలు. అప్పుడు అతడు అత్యంత వేగంగా వన్డేల్లో 200 వికెట్ల క్లబ్‌లో చేరిన తొలి క్రికెటర్‌గా ఘనత సాధిస్తాడు. ఇప్పటి వరకు ఈ ప్రపంచ రికార్డు ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ పేరిట ఉంది.
100 ఇన్నింగ్స్‌లో 195
స్టార్క్ 102 ఇన్నింగ్స్‌లో 200 వికెట్లు తీశాడు. షమీ 100 ఇన్నింగ్స్‌లో ఇప్పటి వరకు 195 వికెట్లు దక్కించుకున్నాడు. అంటే నెక్ట్స్ ఆడబోయే వన్డేలో షమీ మరో ఐదు వికెట్లు తీస్తే, స్టార్క్ వరల్డ్ రికార్డును అతడు బ్రేక్ చేసినట్టవుతుంది. కాగా, టీమిండియా తరఫున అత్యంత వేగంగా వన్డేల్లో 200 వికెట్ల తీసిన బౌలర్‌గా ప్రస్తుత చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఉన్నాడు. అతడు 133 ఇన్నింగ్స్‌లో ఈ మార్క్ ను టచ్ చేశాడు. ఈ రికార్డును కూడా అధిగమించినట్టవుతుంది.
వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్ల చేసిన బౌలర్లు
1. మిచెల్ స్టార్క్- 102 మ్యాచులు
2. సక్లెయిన్ ముస్తాక్- 104 మ్యాచులు
3. ట్రెంట్ బౌల్ట్- 107 మ్యాచులు
4. బ్రెట్ లీ- 112 మ్యాచులు
5. అలెన్ డొనాల్డ్- 117 మ్యాచులు
కాగా టీమిండియా - ఇంగ్లాండ్ జనవరి 22 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఐదు టీ20లు ఆడనుంది. ఆ తర్వాత ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభంకానుంది. ఫిబ్రవరి 6న నాగ్‌పూర్‌లో తొలి వన్డే జరగగా, ఫిబ్రవరి 9న కటక్‌లో రెండో వన్డే, ఫిబ్రవరి 12న అహ్మదాబాద్‌లో మూడో వన్డే జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications