Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

45 నిమిషాల పాటు రఫ్ఫాడించిన షమీ.. స్టేడియం ధనాధన్!(వీడియో వైరల్)

సీనియర్‌ పేసర్‌ మహమ్మద్‌ షమికి సంబంధించి బీసీసీఐ తాజాగా ఓ ఆసక్తికరమైన వీడియోను అభిమానుల‌తో పంచుకుంది. ఇందులో మ‌హ్మ‌ద్ ష‌మీ బౌలింగ్ ప్రాక్టీస్ అద్భుతంగా చేస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

దాదాపు 14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత, టీమిండియా తరపున ఆడేందుకు సిద్ధమవుతున్నాడు సీనియర్‌ పేసర్‌ మహమ్మద్‌ షమి. 2023 వ‌న్డే ప్రపంచ కప్ లో గాయ‌ప‌డిన త‌ర్వాత శస్త్రచికిత్స చేయించుకుని జ‌ట్టుకు దూర‌మైన షమీ.. తిరిగి మళ్లీ ఇప్పుడే జ‌ట్టులోకి వ‌చ్చాడు.

IND vs ENG series Mohammed Shami bowls 45 minutes in TeamIndia s practice session with strapped knee

రీసెంట్ గా దేశవాళీ క్రికెట్ లో అద్భుతంగా ఆడి ఫిట్‌నెస్, ఫామ్‌ ను నిరూపించుకున్నాడు. దీంతో ఇప్పుడు ఇంగ్లాండ్‌తో టీ20, వన్డే సిరీస్.. ఛాంపియన్స్‌ ట్రోఫీ జట్టులో స్థానాన్ని సంపాదించుకున్నాడు.ఈ క్రమంలోనే జ‌ట్టుతో క‌లిసిన అత‌డు.. తాజాగా ఈడెన్ గార్డెన్స్‌లో ప్రాక్టీస్ ప్రారంభించాడు.

ప్రస్తుతం బుమ్రా గాయంతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో.. క్రికెట్ అభిమానుల దృష్టంతా షమీపైనే పడింది. ఈ నేపథ్యంలోనే ప్రాక్టీస్‌ సెషన్‌లో చెమటోడ్చిన షమి.. ఎడమ మోకాలికి పట్టీ కట్టుకుని మరీ గంటకు పైగా బౌలింగ్‌ ప్రాక్టీస్ చేశాడు. బౌలింగ్‌ కోచ్‌ మోర్కెల్‌ నేతృత్వంలో సాధన చేశాడు.

తిలక్‌ వర్మ, అభిషేక్‌ శర్మ, ధ్రువ్‌ జురెల్‌ లాంటి కుర్రాళ్లకు బౌలింగ్ వేస్తూ ఫుల్ ఫామ్ లో కనిపించాడు. ఇంకా చెప్పాలంటే ఫిజియో, స్ట్రెంత్‌ అండ్‌ కండీషనింగ్‌ కోచ్‌ సాయం లేకుండానే ఏకబిగిన 45 నిమిషాల పాటు బంతులు సంధిస్తూనే ఉన్నాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ పోస్ట్ చేసి.. 'హీ ఈజ్ బ్యాక్' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.

Story first published: Monday, January 20, 2025, 13:03 [IST]
Other articles published on Jan 20, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+