రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా యువ బ్యాటర్లు రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్ డకౌట్లయ్యారు. ఆరు బంతులకు రజత్ పటిదార్ , ఎదుర్కొన్న తొలి బంతికే సర్ఫరాజ్ పెవిలియన్‌కు చేరారు. అయితే వీరిద్దరు ఒకే బౌలర్‌కు వికెట్లు సమర్పించుకున్నారు. అంతేకాదు, ఒకే రీతిలో ఔటవ్వడమేగాక, ఒకే ఫీల్డర్ చేతికి చిక్కడం గమనార్హం.
పక్కా ప్రణాళికతో భారత యువ బ్యాటర్లను ఇంగ్లండ్ బోల్తాకొట్టించింది. క్రీజులోకి వచ్చిన తర్వాత కొన్ని బంతులు డిఫెండ్ ఆడటానికి ప్రయత్నిస్తారని భావించింది. స్పిన్‌లో ఫార్వర్డ్ డిఫెండ్‌కు ట్రై చేస్తారని గ్రహించింది. లెగ్ స్టంప్ వైపుగా బంతులు సంధించాలని బౌలర్లకు సూచించి, దానికి తగ్గట్లుగా ఫీల్డింగ్‌ను బెన్ స్టోక్స్ మోహరించాడు.

మరోవైపు షోయబ్ బషీర్ వేసిన బంతిని రజత్ పటిదార్ ఫుట్ వర్క్‌తో డిఫెండ్ చేశాడు. కానీ బ్యాటుకు ఎడ్జ్ తీసుకుని షార్ట్ లెగ్‌లో ఉన్న ఒలీ పోప్ చేతికి చిక్కాడు. అదే తరహా బంతిని సర్ఫరాజ్ ఖాన్‌కు బషీర్ బౌలింగ్ చేశాడు. సేమ్ టూ సేమ్.. సర్ఫరాజ్ కూడా షార్ట్ లెగ్‌లో ఉన్న పోప్‌కు క్యాచ్ ఇచ్చాడు.
రజత్ పటిదార్ తన ఆరు ఇన్నింగ్స్‌ల్లో డకౌటవ్వడం ఇది రెండోసారి. సెకండ్ ఇన్నింగ్స్‌ల్లో ఖాతా తెరవకుండా పెవిలియన్‌కు చేరడం వరుసగా రెండో సారి. అంతేగాక ఈ సిరీస్‌లో రజత్ స్పిన్నర్ల చేతిలోనే ఔటయ్యాడు. వైజాగ్ టెస్టులో అరంగేట్రం చేసిన రజత్ (33, 9 పరుగులు) రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ రెహాన్ అహ్మద్ బౌలింగ్ వెనుదిరిగాడు. అలాగే రాజ్‌కోట్ టెస్టులో (5, డకౌట్) టామ్ హర్ట్‌లీ బౌలింగ్‌లో, ప్రస్తుతం జరుగుతున్న రాంచీ టెస్టులో (17, 0) షోయబ్ బషీర్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేర్చాడు.
మరోవైపు సర్ఫరాజ్ ఖాన్ రాజ్‌కోట్ టెస్టుతో అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అర్ధశతకాలు బాదాడు. తొలి ఇన్నింగ్స్‌లో 66 బంతుల్లో 62 పరుగులు చేసి రనౌటయ్యాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో 72 బంతులు 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కానీ రాంచీ టెస్టులో నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 14 పరుగులు చేసిన అతడు రెండో ఇన్నింగ్స్‌లో డకౌటయ్యాడు.