For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సూపర్‌మ్యాన్‌లా సర్ఫరాజ్ స్టన్నింగ్ క్యాచ్ (Video)

రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తుంది. గెలుపు దిశగా అడుగులు వేస్తుంది. విజయానికి మరో 152 పరుగుల దూరంలో నిలిచింది. ఆదివారం ఆట ముగిసేసరికి టీమిండియా 8 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. క్రీజులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (24; 27 బంతుల్లో), యశస్వీ జైస్వాల్ (16; 21 బంతుల్లో) ఉన్నారు.

అయితే ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సెన్సేషనల్ క్యాచ్ అందుకున్నాడు. క్షణాల్లోనే బంతిని అంచనా వేస్తూ డైవ్ చేసి సూపర్ మ్యాన్‌లా క్యాచ్‌ను పట్టాడు. కుల్‌దీప్ యాదవ్ ‌బౌలింగ్‌లో టామ్ హర్ట్‌లీ భారీషాట్ ఆడాడు. అంతకుముందే జడేజా బౌలింగ్‌లో టామ్ మిడ్‌ వికెట్‌ మీదుగా సిక్సర్ బాదాడు.

IND vs ENG: Sarfaraz Khan takes a stunning catch like Superman

అదే ఉత్సాహంతో కుల్‌దీప్ వేసిన బంతిని టామ్ హర్ట్‌లీ మిడ్ ఆన్-లాంగ్ ఆన్ మధ్య నుంచి స్టాండ్స్‌కు తరలించాలనుకున్నాడు. కానీ బంతి బ్యాటుకు సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు. డీప్ మిడ్ ఆన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సర్ఫరాజ్ వెంటనే స్పందించాడు. ముందుకు డైవ్ చేస్తూ అద్భుతంగా క్యాచ్‌ను అందుకున్నాడు. అనంతరం సర్ఫరాజ్ ఫ్యాన్స్‌కు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి వికెట్‌ను సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.

కాగా, ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 53.5 ఓవర్లలో 145 పరుగులకే కుప్పకూలింది. రవిచంద్రన్ అశ్విన్ (5/51), కుల్‌దీప్ యాదవ్ (4/22) మాయాజాలానికి ఇంగ్లిష్ జట్టు విలవిలలాడింది. జాక్ క్రాలే (60; 91 బంతుల్లో) టాప్ స్కోరర్. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ఇంగ్లండ్‌ను అశ్విన్ దెబ్బకొట్టాడు. వరుస బంతుల్లో వరుస బంతుల్లో బెన్ డకెట్ (15; 15 బంతుల్లో), ఒలీ పోప్ (0; 1 బాల్)ను ఔట్ చేశాడు. కాసేపటికే ప్రమాదకర బ్యాటర్ జో రూట్ (11; 34 బంతుల్లో)ను అశ్విన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కు‌ల్‌దీప్ యాదవ్‌ కూడా చెలరేగడంతో టీ విరామానికి ఇంగ్లండ్ 120/5తో నిలిచింది.

అయితే ఆఖరి సెషన్‌ను జడేజా వికెట్‌తో ప్రారంభించాడు. కుదుకుకున్న జానీ బెయిర్‌స్టో (30; 42 బంతుల్లో)ను ఔట్ చేశాడు. ఆ తర్వాత కుల్‌దీప్ ఒకే ఓవర్‌లో టామ్ హర్ట్‌లీ (7; 25 బంతుల్లో), రాబిన్సన్ (0, 3 బంతుల్లో) ఔట్ చేశాడు. అనంతరం ఫోక్స్ (17;76 బంతుల్లో) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. ఈ దశలో కెప్టెన్ రోహిత్..అశ్విన్‌కు బంతి అందించడంతో ఇంగ్లండ్ 192 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించగలిగింది. పరుగులకు ఆలౌటైంది. జో రూట్ (11), బెన్ స్టోక్స్ (4) పరుగులు చేశారు.

కాగా, 219/7 ఓవర్‌నైట్ స్కోరుతో ఇవాళ ఆటను ప్రారంభించిన టీమిండియా 103.2 ఓవర్లకు 307 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ కంటే 46 పరుగుల వెనుకంజతో తొలి ఇన్నింగ్స్ ముగించింది. అయితే వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ (90; 149) గొప్పగా పోరాడాడు. కుల్‌దీప్ యాదవ్ (28; 131 బంతుల్లో)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత అరంగేట్ర ప్లేయర్ ఆకాశ్ దీప్ (9; 29 బంతుల్లో)తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 40 పరుగులు జోడించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ అయిదు వికెట్లు, టామ్ హర్ట్‌లీ మూడు, అండర్సన్ రెండు వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 353 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

Story first published: Sunday, February 25, 2024, 17:18 [IST]
Other articles published on Feb 25, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+