For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జడేజా సెల్ఫిష్‌కు సర్ఫరాజ్ బలి! కోపంతో ఊగిపోయిన రోహిత్ (Video)

అరంగేట్ర ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ (62; 66 బంతుల్లో) దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. రవీంద్ర జడేజా 99 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు చేరాడు. అప్పటివరకు సాధికారికంగా ఆడుతూ సెంచరీ సాధించేలా కనిపించిన సర్ఫరాజ్ రనౌటవ్వడంతో స్టేడియమంతా ఒక్కసారిగా మూగబోయింది.

అసలేం జరిగిదంటే.. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్ జరుగుతున్న మూడో టెస్టులో సర్ఫరాజ్ భారత్ తరఫున అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. గత మూడేళ్లుగా దేశవాళీ ట్రోఫీలో పరుగుల వరద పారిస్తున్న అతడు ఎట్టకేలకు టీమిండియా టెస్టు క్యాప్‌ను అందుకున్నాడు. దానికి తగ్గట్లుగానే పరుగుల దాహంతో ఇన్నింగ్స్ ప్రారంభించాడు.

IND vs ENG: Sarfaraz Khan sacrifice his wicket to Jadeja Century.. Rohit Sharma was so angry

వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ సర్ఫరాజ్ బౌండరీల మోత మోగించాడు. 48 బంతుల్లో అర్ధశతకం సాధించి రికార్డు సృష్టించాడు. అరంగేట్ర టెస్టులో అత్యంత వేగంగా అర్ధసెంచరీ బాదిన భారత ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. అయితే మరో ఎండ్‌లో జడేజా సెంచరీకి చేరువవుతున్నాడు. జడ్డూ శతకాన్ని తొందరగా అందుకోవాలని తన పార్టనర్ పరుగుకు పిలిచిన ప్రతి సందర్భంలో సర్ఫరాజ్ దూసుకెళ్లాడు.

99 పరుగుల వద్ద ఉన్నప్పుడు అండర్సన్ బౌలింగ్‌లో జడేజాకు సింగిల్‌కు యత్నించి సర్ఫరాజ్‌ను పిలిచాడు.
కానీ కొద్ది దూరం వచ్చిన తర్వాత జడేజా తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. నో చెబుతూ వెనక్కి వెళ్లాడు. మరో ఎండ్‌లో సర్ఫరాజ్ వెనక్కి తిరిగి క్రీజులోకి వెళ్లేలోపు మార్క్ వుడ్.. బుల్-త్రో వేశాడు. ఫలితంగా సర్ఫరాజ్ గొప్ప ఇన్నింగ్స్ మధ్యలోనే నిలిచిపోయింది. డ్రెస్సింగ్ రూమ్‌లో నుంచి ఇదంతా చూసిన కెప్టెన్ రోహిత్ శర్మ కోపంతో ఊగిపోయాడు. ఫ్రస్టేషన్‌తో అరుస్తూ క్యాప్ తీసి నేలకేసి కొట్టాడు. మరోవైపు జడేజా సెల్ఫిష్ అంటూ ట్విటర్‌లో ట్రోల్ చేస్తున్నారు.

కాగా, తొలి రోజు ఆట ముగిసేసరికి భారత్ అయిదు వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా (110), కుల్‌దీప్ (1) ఉన్నారు. రోహిత్ శర్మ (131) శతకం సాధించాడు. జైస్వాల్ (10), రజత్ పటిదార్ (5), గిల్ (0) నిరాశపరిచారు.

Story first published: Thursday, February 15, 2024, 17:41 [IST]
Other articles published on Feb 15, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+