IND vs ENG: బ్యాక్ టు బ్యాక్ రివ్యూలు తీసుకున్న విరాట్ కోహ్లీ..ఎద్దేవా చేసిన భారత కామెంటేటర్! ఆపై ప్రశంసలు!

నాటింగ్‌హామ్‌: డెసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్‌ఎస్) అంటే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ. వికెట్ల వెనుక నుంచి బంతి గమనాన్ని నిశితంగా పరిశీలించే ధోనీ.. డీఆర్‌ఎస్ తీసుకున్నాడంటే అది దాదాపు సక్సెస్ అయినట్టే. ధోనీ డీఆర్ఎస్ తీసుకుంటే క‌చ్చితంగా భార‌త్‌కు అనుకూలంగా వ‌స్తుంద‌ని అభిమానులు కూడా న‌మ్ముతారు. అంపైర్లు కూడా మహీ నిర్ణయంతో ఏకీభవించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ధోనీ లేక‌పోవ‌డం వ‌ల్ల టీమిండియాకు డీఆర్ఎస్ విష‌యంలో చాలా ఇబ్బంది క‌లుగుతోంది. ఈ విష‌యంలో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నమ్మకం పెట్టుకుంటే.. ఒక్కోసారి ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని భారత కామెంటేటర్ చెప్పాడు.

IND vs ENG 1st Test: లంచ్ బ్రేక్.. ఇంగ్లండ్ 61/2! ఫలించిన కోహ్లీ వ్యూహం!!IND vs ENG 1st Test: లంచ్ బ్రేక్.. ఇంగ్లండ్ 61/2! ఫలించిన కోహ్లీ వ్యూహం!!

అప్పీల్ చేసినా:

అప్పీల్ చేసినా:

విషయంలోకి వెళితే... ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా బుధవారం భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం అయింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టుకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఇన్నింగ్స్ మొదటి ఓవ‌ర్‌లోనే ఓపెనర్‌ రోరీ బర్న్స్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ ఐదో బంతికి బర్న్స్‌ ఎల్‌బీడ‌బ్ల్యూగా వెనుదిరిగాడు. అనంతరం భారత బౌలర్లు కట్టుదిట్టమైన బంతులేయడంతో ఇంగ్లండ్ ప్లేయర్స్ పరుగులు చేయడానికి చెమటోడ్చారు. డొమినిక్‌ సిబ్లీ నిదానంగా ఆడగా.. జాక్‌ క్రాలే కాస్త బ్యాట్ జులిపించాడు. అయితే మొహ్మద్ సిరాజ్ వేసిన 21 ఓవర్ మూడో బంతిని క్రాలే షాట్ ఆడగా.. బంతి ప్యాడ్లను తాకింది. భారత్ అప్పీల్ చేసినా.. అంపైర్ ఔట్ ఇవ్వలేదు.

మంజ్రేకర్ ఎద్దవా:

అంపైర్ నిర్ణయం అనంతరం వికెట్ కీపర్ రిషబ్ పంత్ సాయంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రివ్యూ కోరాడు. ఈ సమయంలో కామెంట్రీ బాక్సులో ఉన్న వివాస్పద వ్యాఖ్యాత, టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్‌ సంజయ్ మంజ్రేకర్ ఎద్దవా చేశాడు. ఎంఎస్ ధోనీ లేనిలోటు స్పష్టంగా కనిపిస్తోందని మంజ్రేకర్ అన్నాడు. రివ్యూలో బంతి వికెట్లను మిస్ అవుతున్నట్టు తేలింది. థర్డ్ అంపైర్.. అంపైర్స్ కాల్‌కి కట్టుబడంతో.. టీమిండియాకు ప్రతికూల ఫలితం వచ్చింది. అదే ఓవర్ చివరి బంతిని జాక్‌ క్రాలే డిఫెన్స్ ఆడగా.. బంతి వెళ్లి కీపర్ చేతుల్లో పడింది. భారత ప్లేయర్స్ అప్పీల్ చేసినా అంపైర్ ఔట్ ఇవ్వలేదు. ఈసారి పంత్ కాంఫిడెన్స్ తో కోహ్లీ మరోసారి రివ్యూ కోరాడు. ఆ వెంటనే కోహ్లీ మంచి నిర్ణయం తీసుకున్నాడు అని మంజ్రేకర్ ప్రశంసించాడు. రివ్యూలో బ్యాటును బంతి తాకినట్టు తేలడంతో క్రాలే పెవిలియన్ చేరాడు. మంజ్రేకర్ వ్యాఖ్యలపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

నిలకడగా ఆడుతున్న రూట్‌:

నిలకడగా ఆడుతున్న రూట్‌:

భోజన విరామం అనంతరం ఇంగ్లండ్ జట్టు మూడో వికెట్‌ కోల్పోయింది. పేసర్ మొహ్మద్ షమీ వేసిన ఇన్నింగ్స్‌ 28వ ఓవర్‌లో మూడో బంతికి ఓపెనర్ డొమినిక్‌ సిబ్లీ (18) ఔట్ అయ్యాడు. షార్ట్‌ మిడ్‌ వికెట్‌లో కేఎల్‌ రాహుల్‌కు చిక్కాడు. అంతకుముందు ఇన్నింగ్స్ మొదటి ఓవ‌ర్‌లోనే మరో ఓపెనర్‌ రోరీ బర్న్స్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ ఐదో బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ జో రూట్‌ (42), జానీ బెయిర్‌స్టో (13) ఉన్నారు. ఇంగ్లండ్ 42 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది.

స్టేడియంలోకి ఫాన్స్:

స్టేడియంలోకి ఫాన్స్:

కరోనా వైరస్ కారణంగా 2020 ఆరంభం నుంచి మైదానంకు అభిమానులు రావడం లేదు. అయితే ఇటీవల కేసులు తగ్గడంతో.. భారత్‌, ఇంగ్లండ్‌ టెస్ట్ సిరీసుకు ఇంగ్లండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అభిమానులను స్టేడియంలోకి అనుమతించారు. దీంతో చాలా కాలం తర్వాత మైదానంలో అభిమానులు సందడి చేశారు. ఇరు జట్ల అభిమానులతో స్టేడియం కిక్కిరిసిపోయింది. టెస్ట్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన అభిమానుల అరుపులు, కేకలతో ట్రెంట్ బ్రిడ్జ్ స్టేడియం పూర్తి స్థాయిలో నిండిపోయింది. భారతీయ అభిమానులు కూడా మ్యాచ్ చూడడానికి పెద్ద సంఖ్యలో వచ్చారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, August 4, 2021, 19:52 [IST]
Other articles published on Aug 4, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X